Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ సోషల్ మీడియా స్టార్

By:  Tupaki Desk   |   18 Jun 2017 9:33 AM GMT
ఆ హీరోయిన్ సోషల్ మీడియా స్టార్
X
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ వెళ్లిపోయి తన క్రేజ్ విపరీతంగా పెంచేసుకుంది. ఇక్కడున్నపుడే టాప్ స్టార్ గా కొనసాగిన ఈమె.. బాలీవుడ్ వెళ్లాక తన రేంజ్ ను మరింతగా పెంచేసుకుంది. రేంజ్ ను అమాంతం తారాస్థాయికి చేర్చేసుకుంది ఈ తారామణి.

తన తొలి మూవీ బేవాచ్ తో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయినా.. పీసీ సాధించిన ఘనతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు హాలీవుడ్ స్టార్స్ కు మించిన గుర్తింపు దక్కించుకుని మరో అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది పీసీ. సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తిగా.. టాప్ ర్యాంక్ ను సొంతం చేసుకుంది ప్రియాంక. ఎంవీపీ ఇండెక్స్ అనే సంస్థ ఈ జాబితాను రూపొందించగా.. ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇన్ స్టాగ్రామ్.. యూట్యూబ్.. గూగుల్ ప్లస్.. ఇలా అనేక సోషల్ మీడియా వేదికల్లో ఆయా వ్యక్తుల పాపులారిటీ ఆధారంగా ఈ లిస్ట్ ను తయారు చేశారు.

ఇందులో పిగ్గీఛాప్స్ కు టాప్ ర్యాంక్ దక్కగా.. ఆ తర్వాతి ప్లేస్ బేవాచ్ యాక్టర్ డ్వేన్ జాన్సన్ నిలవడం విశేషం. థర్డ్ ప్లేస్ కెవిన్ హార్ట్ కు దక్కగా.. వండర్ ఉమన్ గాల్ గాడట్ ఫోర్త్ ప్లేస్ ను ఆక్రమించింది. హాలీవుడ్ స్టార్స్ ను తలదన్నేసి ఇండియన్ బ్యూటీ సోషల్ మీడియా స్టార్ గా అవతరించడం విశేషంగానే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/