Begin typing your search above and press return to search.
అలా తల్లిని అవ్వాలనుకున్నా.. కాని అమ్మ ఒప్పుకోలేదు
By: Tupaki Desk | 27 April 2022 11:30 PM GMTగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అమ్మతనాన్ని ఆస్వాదిస్తుంది. జనవరి లో బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం అందుకు సంబంధించిన ఆనందంలో మునిగి తేలుతుంది. ఒక వైపు తల్లితనం ను ఆస్వాదిస్తూనే మరో వైపు సినిమా కార్యక్రమాలు ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తన అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఈమె తన ఆత్మ కథను విడుదల చేసింది.
ఆ ఆత్మకథలో పలు విషయాల గురించి ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. అందులో ప్రధానంగా ఆమె తల్లి కావాలనుకున్న విషయం గురించి ప్రస్తావించింది. అనాథ బాలికను దత్తత తీసుకుని పెంచుకోవాలనుకున్న తనకు అమ్మ అడ్డు చెప్పింది. అమ్మ ఒప్పుకోక పోవడంతో నేను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చిందని ప్రియాంక చోప్రా తన ఆత్మ కథలో పేర్కొంది.
ఒకానొక సమయంలో హాస్పిటల్ బయట కారు పార్కింగ్ వద్ద ఒక చిన్న బాలిక ఏడుస్తూ కనిపించింది. ఆ బాలికను నేను ఇంటికి తీసుకు వచ్చాను. చూడగానే ఆ బాలికకు కనెక్ట్ అయ్యాను. ఆ బాలిక నన్ను ఎంతగానో కదిలించింది. దాంతో నేను ఆ బాలికను పెంచుకోవాలని భావించాను. కాని అమ్మ నా నిర్ణయాన్ని సమర్థించలేదు. ఆమె ఆ బాలికను పిల్లలు కలిగే అవకాశం లేని దంపతులకు ఇవ్వాలని చెప్పింది.
అమ్మ సూచనతో అయిష్టంగానే కృష్ణ అష్టమి రోజు ఒక పిల్లలు లేని దంపతులకు ఆ పాపను ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో దత్తత గురించిన సమాచారం కాని.. దత్తత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాని నాకు తెలియదు. ఆ తర్వాత వారు తీసుకున్న వారు ఆ ప్రాసెస్ ను చేసుకున్నారు. అమ్మ ఆ సమయంలో అడ్డు చెప్పడం వల్ల నా కల అలాగే ఉండి పోయిందని ప్రియాంక చోప్రా పేర్కొంది.
అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారికి మంచి భవిష్యత్తు కల్పించడం అనేది చాలా అద్బుతమైన ఆలోచన.. అలాంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం నిజంగా అభినందనీయం. కాని పిల్లలను కనే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశం లేని వారికి అనాధ పిల్లలను ఇవ్వడం మంచిది అనేది ప్రియాంక చోప్రా తల్లి ఆలోచన. అందుకే ప్రియాంక చోప్రా ను పిల్లలను కనాల్సిందిగా ఆమె తల్లి సూచించింది.
బాలీవుడ్.. హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ప్రస్తుతానికి అమెరికా లోని తమ అత్యంత విలాసవంతమైన భవనంలో పాపాయితో కలిసి నిక్ జోనస్ తో కలిసి జీవితాన్ని సరదాగా గడుపుతోంది. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక చోప్రా పలు సినిమాలు హాలీవుడ్ లో కూడా చేస్తోంది. ఇక నిక్ ఒక అంతర్జాతీయ స్థాయి పాప్ సింగర్ అనే విషయం తెల్సిందే.