Begin typing your search above and press return to search.
దేశీ గాళా మజాకానా.. దుమ్ము దులిపేసిందిగా!
By: Tupaki Desk | 1 Sep 2021 2:30 AM GMTహాట్ కంటెంట్ తో హీట్ పుట్టించడంలో పీసీ తర్వాతే! నిక్ జోనాస్ ని పెళ్లాడి హాలీవుడ్ లో పాపులర్ స్టార్ గా కెరీర్ ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల వరుస ఫోటోషూట్లతో హీటెక్కిస్తోంది. బోల్డ్ అండ్ డస్కీ ఇంటర్వ్యూలతో .. ఆటోబయోగ్రఫీ బుక్ లాంచ్ లతో మంటలు పుట్టించింది.
తాజాగా మరోసారి ఓ యూనిక్ ఫోటోషూట్ తో దుమ్ము దులిపేసింది ఈ దేశీ గాళ్. ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ప్రియాంక చోప్రా వెర్రెత్తించే ఫోటోషూట్ లో పాల్గొంది. ``మా దేశీ గాళ్ లా ఇంకెవరూ లేరు`` అన్న క్యాప్షన్ తో ఈ ఫోటోషూట్ ని రసరమ్యంగా ఆవిష్కరించింది సదరు మ్యాగజైన్. వోగ్ ఫోటోషూట్ కోసం రకరకాల భంగిమల్లో విభిన్నమైన డిజైనర్ దుస్తులను ధరించి పీసీ అదరగొట్టింది.
దేశీ గర్ల్ ఆఫ్ బాలీవుడ్ గా పాపులరైన ప్రియాంక చోప్రా భారతదేశం పేరును గ్లోబల్ మ్యాప్ పైకి తీసుకెళ్లి సత్తా చాటుతోంది. ప్రియాంక చోప్రా వోగ్ ఇండియా కవర్ మ్యాగజైన్ ను అలంకరించిన తీరు యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. పీసీ డిజైనర్ అవతార్ మళ్లీ మళ్లీ బోయ్స్ ని ప్రేమలో పడేలా చేస్తోంది.
వోగ్ షూట్ లో చెర్రీ రెడ్ డియోర్ డ్రెస్ లో కలల రాణినే తలపించింది. వేరొక ఫోటోలో కోట్ ధరించి స్మోకీ కళ్ళతో కిల్ చేసింది. వెనెటా బ్రాండ్ డిజైన్ ఇది. ఆ మాట్టే మేకప్ ఆకర్షణను పెంచింది.
తెల్లటి టల్లే దుస్తులలోనూ పీసీ ఆకట్టుకుంది. పట్టు దుస్తులలో మైమరిపించే అవతార్ తో మరో ఫోటోగ్రాఫ్ మతులు చెడగొడుతోంది.
రోక్సాండా సిల్క్ డ్రెస్ కి ఆభరణాల అలంకరణ ఆకర్షించింది.
ప్రియాంక చోప్రా బహుముఖ ప్రజ్ఞ ఉన్న నటి.. నిర్మాత .. గాయని .. ఒక వ్యాపారవేత్త కూడా. ఇటీవల స్టార్ హోటల్ ని కూడా ప్రారంభించి ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ని కొనసాగిస్తోంది. అనోమలీ అనే తన స్వంత హెయిర్ లైన్ బ్రాండ్ ను ఇటీవల విస్తరిస్తోంది. సొంత వ్యాపారాలకు బ్రాండింగ్ చేస్తూ నిరంతరం బిజీగా ఉంది.
వాస్తవానికి మహమ్మారి రెండవ వేవ్ తర్వాత ప్రపంచం నెమ్మదిగా ఓపెనవ్వడం ప్రారంభించిన వెంటనే గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా తిరిగి తన పనిలో బిజీ అయ్యింది. ఇటీవలి వోగ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కుటుంబంతో కలిసి లాక్ డౌన్ కాలంలో సురక్షితం అనుకున్న తర్వాతే తిరిగి విధుల్లోకి వెళ్లానని కానీ తాను భయపడ్డానని ఒప్పుకుంది.
నేను ఇంట్లో ఆరు నెలలు నా కుటుంబంతో సురక్షితంగా ఉన్నాను. ఆపై జర్మనీ మొదటిసారి నేను పనికి వెళ్ళాను. నేను విమానంలో ఏడ్చాను. ..చాలా భయపడ్డాను. ఆ సమయంలో నా భర్త.. గాయకుడు నిక్ జోనస్ నాతో ఉండడంతో ప్రశాంతంగా ఉన్నాను. నిక్.. మా అమ్మ నా కుటుంబం నాతో వచ్చారు. నేను సినిమా చేస్తున్నప్పుడు మేము క్రిస్మస్ నూతన సంవత్సరాలను కలిసి గడిపాము. నిక్ నాకు వృత్తిగతంగా స్థిరపడటానికి సహాయం చేస్తున్నారు అని తెలిపింది. కీను రీవ్స్ చిత్రం `ది మ్యాట్రిక్స్ 4` పైనా పీసీ ముచ్చటించారు. ప్రియాంక చోప్రా జోనాస్ అమెజాన్ వెబ్ సిరీస్ సిటాడెల్.. రొమాంటిక్ డ్రామా టెక్స్ట్ ఫర్ యు.. ది మ్యాట్రిక్స్ 4 ప్రాజెక్టులతో బిజీ. ఇటీవల ప్రకటించిన బాలీవుడ్ చిత్రం జీ లే జరా చిత్రీకరణలో జాయిన్ కావాల్సి ఉంది.