Begin typing your search above and press return to search.

లెహంగాలో గ్లోబ‌ల్ స్టార్ కొత్త కాంతులు

By:  Tupaki Desk   |   5 Nov 2021 3:03 PM GMT
లెహంగాలో గ్లోబ‌ల్ స్టార్ కొత్త కాంతులు
X
దీపావ‌ళిని ఒక్కో స్టార్ ఒక్కోలా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా క‌థానాయిక‌లు సాంప్ర‌దాయ క‌ట్టు బొట్టుతో చీర‌ల్లో ముస్తాబై దీపాల పండ‌గ‌కు కొత్త క‌ళ‌ను తెచ్చారు. అయితే వీరంద‌రి కంటే కాస్త డిఫ‌రెంట్ గా ప్ర‌య‌త్నించారు గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా. ఈ దీపావళి శుభ సందర్భంగా లెహెంగాలో అద్భుతమైన ఫోటోషూట్ ని తాజాగా అభిమానుల కోసం షేర్ చేసారు పీసీ.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ ఉత్సవంలో అందంగా అలంకరించుకుని పీసీ ప్ర‌త్య‌క్ష‌మైన తీరు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఇన్ స్టాలో ఫోటోగ్రాఫ్స్ వైర‌ల్ గా షేర్ అవుతున్నాయి.  బంగార‌ లేత గోధుమరంగు రంగు లెహంగా ధరించి దానిపై పూల ముద్రణ ప్లీట్ నమూనాతో ఆ డ్రెస్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఆమె దానిని హెవీ సీక్విన్డ్ - మిర్రర్ వర్క్ చోలీతో జత చేసింది. అందంగా పూల దుపట్టాతో మెరిపించింది. వెల్వెట్ గ్రీన్ కర్టెన్ దీపావళి లైట్ల నేపథ్యంతో పాటు గాలికి ఎగిరే జుట్టుతో గొప్ప తేజ‌స్సును ప్ర‌స‌రిస్తోంది పీసీ.

దీపావళి వేడుకలో...  మంచి కాంతి ఆనందం క‌ల‌గ‌లిపి చాలా కృతజ్ఞతతో ప్రేమతో సాగే ఉత్సవాలివి.  బహుశా స్టార్స్ నుండి అత్యుత్తమ పండుగ దుస్తులలో ఒకటి లెహంగా..! అంటూ ఆనందంగా త‌న లెహంగాను ప్ర‌ద‌ర్శించింది పీసీ. ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం గ్లోబ‌ల్ స్టార్ గా వెలిగిపోతోంది. హాలీవుడ్ లో వ‌రుస‌గా సిరీస్ లు సినిమాల‌తో బిజీగా ఉంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... పీసీ న‌టిగా నిర్మాత‌గానూ వెలుగుతోంది. ప్రియాంక చోప్రా తదుపరి సిటాడెల్ లో కనిపిస్తుంది. ఇది మల్టీ-సిరీస్ ప్రొడక్షన్. అలాగే భారీ యాక్ష‌న్ చిత్రం మ్యాట్రిక్స్ 4 కూడా పీసీ న‌టిస్తోంది.