Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చిన్న ఫ్రాకు వేసుకున్న పెద్ద పాప‌

By:  Tupaki Desk   |   11 July 2022 12:50 PM GMT
ఫోటో స్టోరి: చిన్న ఫ్రాకు వేసుకున్న పెద్ద పాప‌
X
పాపుల‌ర్ గాయ‌కుడు.. న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా అమెరికా కోడ‌లుగా బోలెడంత పాపులారిటీ ద‌క్కించుకుంది. హాట్ క‌పుల్ ఆద‌ర్శ జంట‌గా వెలిగిపోతున్నారు. పీసీ ప్ర‌స్తుతం బాలీవుడ్ ని వ‌దిలి హాలీవుడ్ లో బిజీ అయిపోయింది. ఇక వెస్ట్ర‌న్ లో సెటిలైంది కాబ‌ట్టి దానికి త‌గ్గ‌ట్టే త‌న యాటిట్యూడ్ ని కూడా మార్చుకుంది. పీసీ ఆల్వేస్ నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ అవ‌తార్ లో క‌నిపిస్తూ గుబులు రేపుతోంది. నిక్ తో రొమాంటిక్ లైఫ్ ని న‌చ్చిన‌ట్టు ఆస్వాధిస్తున్న పీసీ బెడ్ రూమ్ నుంచి ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తూనే ఉంది.

ఓ బోట్ షికార్ లో ఘాటైన రొమాన్స్ చేస్తూ ఉన్న ఫోటోలు కూడా ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి. తాజాగా మ‌రో హాట్ ఫోటో ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. వైట్ అండ్ బ్రింజాల్ క‌ల‌ర్ బికినీలో పీసీ త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శించిన తీరు మ‌తులు చెద‌ర‌గొడుతోంది. ఈ ఫోటోగ్రాఫ్ ని చూడ‌గానే ``చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప‌!`` అంటూ జేడీ తెలుగు మూవీ సాంగ్ ని హ‌మ్ చేస్తోంది యూత్. ఇది యూత్ ని విశేషంగా ఆక‌ర్షిస్తోంది. వాట్సాపుల్లోనూ వైర‌ల్ అవుతోంది.  

చీర్ లీడ‌ర్ వైబ్స్..

ప్రియాంక చోప్రా హబ్బీ నిక్ జోనాస్ లేక్ ప‌రిస‌రాల్లో తాహో వద్ద గోల్ఫ్ ఆడుతున్నప్పుడు అతని కోసం చీర్ లీడ‌ర్ గా మారిన ఫోటోల బంచ్ ఇప్పుడు వైర‌ల్ గా మారుతోంది. దేశీ గాళ్ ప్రియాంక చోప్రా తన భర్త..  నటుడు-గాయకుడు నిక్ జోనాస్ యునైటెడ్ స్టేట్స్ లోని నెవాడాలోని లేక్ తాహోలో గోల్ఫ్ ఆడుతుంటే  అత‌డిని ఉత్సాహ‌ప‌రుస్తూ క‌నిపించింది.

అమెరికన్ సెంచరీ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ (ACC) సందర్భంగా ఇద్దరూ సరదాగా గడిపిన `కూల్` ఫోటోల‌ను ఈ జంట అభిమానుల ఖాతాల్లో పంచుకున్నారు. ACC అనేది సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్.. ఇది ప్రతి సంవత్సరం జూలై రెండవ వారంలో లేక్ తాహోలో జరుగుతుంది. అభిమాని ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోల్లో పీసీ స్పెష‌ల్ గా క‌నిపించింది.  నిక్ ఎప్పటిలాగే ముదురు నీలం రంగు టీ-షర్ట్ లో అందంగా కనిపించారు. బ్లాక్ ప్యాంటు -సాలిడ్ కలర్ క్యాప్ తో నిక్ ఆట‌గాడినే త‌ల‌పించాడు. మరోవైపు.. ప్రియాంక ఒక క్లాసిక్ వైట్ స్లీవ్ లెస్ టాప్ తో పాటు షార్ట్ - బ్లూ జాకెట్ ను ధరించి క‌నిపించింది.

ఈ వీడియోలపై అభిమానులు వేగంగా స్పందించారు. అద్భుతం! జంట ఇలా సరదాగా ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతనితో సంతోషంగా ఉన్న ప్రియాంక ల‌వ్ యు! ఆమె అందంగా ఉంది`` అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్  ప్ర‌స్తుతం పేరెంట్ హుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట ఈ సంవత్సరం ప్రారంభంలో అద్దె గర్భం (స‌రోగ‌సి)లో ఒక కుమార్తెకు జ‌న్మ‌నిచ్చారు. చిన్నారితో అంద‌మైన‌ ప్రయాణం సాగిస్తున్నారు. వారు తమ కుమార్తెకు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ అని పేరు పెట్టారు. కానీ ఇప్పటివరకు చిన్నారి మాల్తీ మేరీ చోప్రా ముఖాన్ని అభిమానుల‌కు చూపించ‌నేలేదు.