Begin typing your search above and press return to search.

వామ్మో పీసీ! క‌ళ్లు భైర్లు క‌మ్మి భూగోళం గిర‌గిరా తిరుగుతోంది!!

By:  Tupaki Desk   |   10 March 2021 4:30 AM GMT
వామ్మో పీసీ! క‌ళ్లు భైర్లు క‌మ్మి భూగోళం గిర‌గిరా తిరుగుతోంది!!
X
గ్లోబ్ ని ఇలా గాల్లో ఎత్తి గిర‌గిరా తిప్పితే గ్లోబ‌ల్ స్టార్ అంటారా? .. ఏమో! అమెరికా కోడ‌లు పీసీ వాల‌కం చూస్తుంటే అలానే అనిపిస్తోంది. గోళం ఎంత‌గా గిర‌గిరా తిరిగితే అంత‌గా పాపులారిటీ ద‌క్కిన‌ట్టే అన్న‌ది పీసీ ఫిలాస‌ఫీ అయ్యుండొచ్చు. కార‌ణం ఏదైనా కానీ.. ఇటు ఇండియా నుంచి అటు అమెరికా వ‌ర‌కూ త‌న హ‌వా సాగుతోంది. బాలీవుడ్ నాయిక‌గా.. హాలీవుడ్ స్టార్ గా అంత‌ర్జాలంలో నిరంత‌రం ట్రెండింగ్ లో నిలుస్తోంది.

పురుషాధిక్య ప్ర‌పంచం రాజ్య‌మేలే చోట తాను ఎన్ని అవ‌మానాల్ని ఎదుర్కొందో ఇంత‌కుముందు ఆటోబయోగ్ర‌ఫీలో వెల్ల‌డించిన ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ కి దూరంగా హాలీవుడ్ నే ఎక్కువ‌గా ఆశ్ర‌యిస్తోంది. ఇక హాలీవుడ్ కి వెళ్లాక త‌న యాటిట్యూడ్ కూడా ఆ రేంజులోనే ఉంద‌న్న విమ‌ర్శ‌లు వేడెక్కిస్తున్నాయి.

ఆటాడేద్దామా? అంటూ ఇదిగో ఇలా భూగోళా(బంతి)న్ని త‌న వేలిపై అలా నిల‌బెట్టేసింది. ఇక ఈ ఫోటోగ్రాఫ్ ఇలా వెబ్ లోకి వ‌చ్చిందో లేదో అలా ల‌క్ష‌లాది వ్యూస్ తో వైర‌ల్ అయిపోయింది. అంత‌గా ఇందులో ఏం ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాలా? పీసీ బికినీ ధ‌రించి దానిపై పాక్షికంగా అందాల్ని ఎలివేట్ చేసే బ్లాక్ మెస్ డిజైన‌ర్ వేర్ ని ధ‌రించింది. వామ్మో పీసీ! క‌ళ్లు భైర్లు క‌మ్మి భూగోళం గిర‌గిరా తిరుగుతోంది!! అంటూ యూత్ ఒక‌టే కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

పీసీ స్టైలింగ్.. హెయిర్ ని డిజైన్ చేసిన తీరు ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. గ్రెగ్ విలియ‌మ్స్ ఫోటోగ్ర‌ఫీ చేయ‌గా... దేనా జియా స్టైలింగ్ చేశారు. ఇసాక్ వి పోలియ‌న్ హెయిర్ ని డిజైన్ చేశారు. జిల్ డెమ్ లింగ్ ఈ మొత్తం ఫోటోషూట్ ని డైరెక్ట్ చేయ‌గా.. అత‌డికి పీసీ థాంక్స్ చెప్పారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే పీసీ ప్ర‌స్తుతం ఏ వ‌ర‌ల్డ్ ఆఫ్ కామ్.. సిటాడెల్ అనే ఆంగ్ల వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తోంది.