Begin typing your search above and press return to search.
పీసీకి ఆ పేరే నచ్చిందట!
By: Tupaki Desk | 8 Sep 2018 4:28 PM GMTగ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో ప్రేమ.. ఆ తర్వాత అతనితో ఎంగేజ్ మెంట్ అందరికీ తెలిసిన విషయాలే. మొదట్లో దాచిపెట్టినా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపొయింది కాబట్టి బహిరంగంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ప్రేమమాధుర్యంలో ఓలలాడుతున్నారు. ఇక మన ఇండియన్ మీడియాకే కాదు.. అమెరికన్ మీడియాకూ ఈ జంటపై తెగ ఇంట్రెస్ట్ ఉంది.
ద హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ ఈ జంటకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలియజేసింది. ఈమధ్యనే.. అంటే ఎప్పుడో కాదు 'C/o కంచరపాలెం' సినిమా రిలీజ్ అయిన శుక్రవారం నాడు 'ద టునైట్ షో' అనే టీవీ కార్యక్రమంలో నిక్ జోనాస్ పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో పీసీ ఆడియన్స్ లో ఒకరిగా కూర్చుంది. ఈ షోలో మాట్లాడుతూ తమ జంటను 'ప్రిక్' అని పిలవడం పీసీకి ఇష్టమని చెప్పాడు. ప్రిక్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం 'గుచ్చడం'.. కొంపదీసి మీరు ఆ ప్రిక్ అనుకునేరు. అది కాదు బాబోయ్. ప్రి అంటే.. ప్రియాంక చోప్రా లో 'ప్రి'. 'క్' అంటే నిక్ లో 'క్'. సో.. ఈ జంటను గురించి మనం మాట్లాడే సమయంలో ప్రిక్ అంటే చాలు.. నిక్ - ప్రియాంకలిద్దరినీ కలిపి మనం గుర్తు చేసుకున్నట్టే.
సెలబ్రిటీ కపుల్స్ కు ఇలా పేర్లు పట్టడం హాలీవుడ్ సంప్రదాయం. ఇక మన బాలీవుడ్ లో కూడా దీపిక పదుకొనే- రణవీర్ సింగ్ జంటను అభిమానులు 'దీప్ వీర్' అని ముద్దుగా పిలుచుకుంటారు. అలానే నిక్ జోనాస్ - ప్రియాంక జంటకు పదుల సంఖ్యలో 'జంటపేరు' సజెషన్స్ వచ్చాయట. అందులో 'ప్రిక్' మాత్రం పీసీ కి తెగ నచ్చిందట. ఇక వేరే పేర్లు ఏంటి అని మీరడగరా..? 'నిక్యాంక'.. 'చోజో'.. 'ప్రాస్'.. 'నిప్రి'.. ప్రినిక్'.. ఇలా చాలా ఉన్నాయి. అవి ఎలా వచ్చాయో మీరే అర్థం చేసుకోండి!