Begin typing your search above and press return to search.

ఒక్క సినిమా కాదన్నందుకు పది పోయాయట

By:  Tupaki Desk   |   12 Nov 2017 9:46 AM GMT
ఒక్క సినిమా కాదన్నందుకు పది పోయాయట
X
ప్రపంచ సుందరి అయ్యాక దక్షిణాదిన హీరోయిన్ గా ప్రస్థానం మొదలుపెట్టి.. ఆపై బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. ఇప్పుడు హాలీవుడ్లోనూ మంచి పేరు సంపాదించింది ప్రియాంక చోప్రా. మొదట్లో చిన్న స్థాయి సినిమాలే చేసిన ప్రియాంక.. నెమ్మదిగా తన కెరీర్ ను మంచి స్థాయికి తీసుకెళ్లింది. ఐతే కెరీర్ ఆరంభంలో ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి సినిమాకు నో చెప్పినందుకు ప్రియాంక కెరీర్ బాగా దెబ్బ తిందట. ఆ సినిమాకు నో చెప్పడం వల్ల ఆమెకు దాదాపు పది సినిమాలు తప్పిపోయాయట. ప్రియాంక తల్లి మధు చోప్రా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రియాంకకు కెరీర్ ఆరంభంలో ఈ దర్శకుడి నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడంతో ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని మధు చోప్రా చెప్పింది. ఆ దర్శకుడు అసభ్యంగా ఉన్న దుస్తులు ధరించమని ప్రియాంకను ఒత్తిడి చేసినట్లు మధు చోప్రా వెల్లడించింది. కెమెరా ముందు అందాల ప్రదర్శన చేయకుండా.. అందాల కిరీటం సాధించడంలో అర్థం ఏముందని ఆ దర్శకుడు హేళనగా మాట్లాడినట్లు మధు చెప్పింది. దీంతో ఆ సినిమా నుంచి ప్రియాంక తప్పుకుందని.. అతను పేరున్న దర్శకుడు కావడంతో తర్వాత ప్రియాంక దాదాపు పది సినిమాలు కోల్పోవాల్సి వచ్చిందని మధు తెలిపింది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువేనని.. ఐతే ఏ రంగంలో మాత్రం లైంగిక వేధింపులు లేవని ప్రియాంక ఇంతకుముందు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.