Begin typing your search above and press return to search.

అమెరికాలో ఇద్దరు అందాల రాణులు

By:  Tupaki Desk   |   26 Sep 2017 4:58 PM GMT
అమెరికాలో ఇద్దరు అందాల రాణులు
X
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ దున్నేస్తున్న భామ ప్రియాంక చోప్రా.. సౌత్ లో ఆ వుడ్డూ.. ఈ వుడ్డూ అనే తేడా లేకుండా తన క్రేజ్ తో వెలిగిపోయే బ్యూటీ నయనతార. ఇప్పుడు వీళ్లిద్దరూ ఓ సందర్భంలో ఎదురుపడ్డారు. ఒకే ప్రదేశంలో కలిశారు. అంతే కాదు.. కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చి సందడి కూడా చేశారు. సహజంగా అందాల మోత మోగించడంలో ఈ భామలు బాగా ముదుర్లే కానీ.. ఇక్కడ మాత్రం వెస్ట్రన్ వేర్ లో ఇండియన్ కల్చర్ ను ప్రతిబింబిస్తున్నారంతే.

గత కొంత కాలంగా పిగ్గీ ఛాప్స్ అమెరికాలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. రకరకాల కార్యక్రమాల కోసం దేశాలు పట్టుకు తిరుగుతున్నా.. మెయిన్ బేస్ మాత్రం అమెరికానే. ఇక నయన తార విషయానికి వస్తే.. తన లవర్ విఘ్నేష్ శివన్ బర్త్ డే సందర్భంగా.. వెకేషన్ కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తోంది. అనుకోకుండా కలిశారో.. ముందుగా అనుకునే మీట్ అయ్యారో తెలీదు కానీ.. వీరిద్దరూ ఒక చోటకు చేరుకున్నారు. నిజానికి నయన్ ఉన్న ఏరియా అయిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దగ్గరకు.. గ్లోబల్ గోల్స్ అవార్డ్ ఫంక్షన్ సందర్భంగా వచ్చింది ప్రియాంక చోప్రా.

ఆ సమయంలో ఇద్దరూ తారసపడడం.. పిచ్చాపాటీ కబుర్లతో పాటు.. ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెప్పుకోవడం.. ఒకరిని ఒకరు పొగడ్తల వానలో కురిపించుకోవడం.. ఒకరిపై ఒకరు క్యూట్ జోక్స్ వేసుకుని తెగ నవ్వుకుని మురిసిపోవడం.. అక్కడి చూపరులను తెగ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా తీసిన పిక్ ఒకటి.. ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయిపోయింది. ఇంతకీ వీరిద్దరూ చెప్పుకున్న కబుర్లు ఏ టాపిక్ గురించి అయి ఉంటాయబ్బా?