Begin typing your search above and press return to search.

మరిచిపోలేని అనుభవం!!

By:  Tupaki Desk   |   22 Sep 2017 7:36 AM GMT
మరిచిపోలేని అనుభవం!!
X
తెరపై హీరోయిన్ గా కనిపించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలోనే కాదు.. సామాజిక బాధ్యత విషయంలోనూ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ముందే ఉంటుంది. అందుకే ఐక్యరాజ్యసమితి లోని భాగమైన యునిసెఫ్ తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రియాంకను ఎంచుకుంది. ఆడపిల్లలను అందరూ బాగా చదివించాలని.. వారికి మగపిల్లలతో సమాన అవకాశాలు కల్పించాలని ప్రియాంక సందర్భం వచ్చినప్పుడల్లా కోరుతూనే ఉంది. రీసెంట్ గా ఓ ఫ్యాన్ ను స్వయంగా వెళ్లి కలిసిన తన గురించి చాలా గొప్పగా చెప్పింది. ఆ ఫ్యాన్ ఎవరో కాదు... చదువుకోసం ప్రాణాలొడ్డి పోరాడి నోబుల్ బహుబతి సొంతం చేసుకున్న మలాలా యూసఫ్ జాయ్.

మలాలాతో కలిసి ఆమెతో ముచ్చటించినప్పటి ఫొటోను ప్రియాంక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇదే ఫొటోతోపాటు మలాలాను ప్రశంసిస్తూ బోలెడు రాసింది .‘మలాలా.. నీ గొప్పతనం.. నువ్వు పంచే స్ఫూర్తి గురించి అసలు ఓ నవల రాయొచ్చు. కానీ బ్రీఫ్ గానే చెబుతా. రేపటి రోజు కోసం ఈ ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చదిద్దడానికి కృషి చేస్తున్న అమ్మాయిలు - అబ్బాయిలందరికీ నువ్వు అందరికీ ఓ రోల్ మోడల్ వి. నీతో గడిపిన కొద్ది గంటలు మరిచిపోలేను. హిందీ సినిమాలపై నీకున్న అభిమానం.. చక్కటి నీ చిరునవ్వు నాకెప్పటికీ గుర్తుంటాయి. ఇంత చిన్నవయసులో నువ్వు తీసుకున్న గొప్ప బాధ్యత చూస్తుంటే ముచ్చటేస్తోంది. నువ్వు నా స్నేహితురాలివని చెప్పడానికి గర్వంగా ఉంది.’’ అంటూ ప్రియాంక మలాలాపై తన అభిమానాన్ని చాటుకుంది.

ప్రియాంక లాంటి స్టార్ ను కలిసి మాట్లాడటం నమ్మలేకపోతున్నానంటూ మలాలా ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకుంది. దీనికి ప్రియాంక మళ్లీ రెస్పాన్స్ కూడా ఇచ్చింది. నిన్ను కలిసిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవంటూ తిరిగి ట్వీట్ చేసింది. బేవాచ్ సినిమాతో హాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రియాంక ప్రస్తుతం కెనడియన్ టీవీ సిరీస్ క్వాంటికో సీజన్-2లో నటిస్తోంది.