Begin typing your search above and press return to search.

పిల్లల కోసమే మగాడు కావాలంతే

By:  Tupaki Desk   |   27 Jan 2016 3:30 PM GMT
పిల్లల కోసమే మగాడు కావాలంతే
X
నాకు మగాడితో అందుకు తప్పితే పనిలేదు.. ఓ సెలబ్రిటీ ఈ స్టేట్మెంట్ ఇవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి. బాలీవుడ్ లో అలాంటి గట్స్ ఉన్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఈ భామ మహిళల కోసం చాలానే కార్యక్రమాలు చేస్తుంటుంది. సినిమాల్లో గ్లామర్ చిందులేసినా, పెర్ఫామెన్స్ రోల్స్ చేసినా.. బైట మాత్రం మహిళలను ఆదుకునే అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది.

స్త్రీలను సొంతకాళ్లపై నిలబెట్టేలా ఆదాయ మార్గం అందించేలా ప్రియాంక యాక్టివిటీస్ ఉంటాయి. మరీ పురుష ద్వేషి ఏం కాదు కానీ.. మగాళ్లపై ఆధారపడి బతకడమంటే మాత్రం బాగా చిరాకు ఈమెకు. ఈ విషయాన్ని ఇంటర్వ్యూ లలో నేరుగానే చెప్పే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో.. ఈమెకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. తాను ఎవరిపై ఆధారపడనని.. ఏదో స్టీరియో టైపు కేరక్టర్ లకు వ్యతిరేమన్న ప్రికయాంక.. తన జీవితంపై కొత్తగా ఏ మగాడి ముద్ర పడాల్సిన అవసరం లేదని తేల్చేసింది. అంతే కాదు.. చివరకు తను డైమండ్స్ కూడా స్వయంగా కొనుక్కోగలిగినపుడు.. అసలు మగాడితో పనేంటి అనింది పీసీ.

ఇంకా అర్ధం కానట్టుగా ఫేస్ పెట్టిన వారికి క్లియర్ గా తన ఫీలింగ్ చెప్పడం కోసం.. 'నాకు పిల్లలను కనడానికి తప్ప అసలు మగాడితో ఎలాంటి అవసరం లేదు' అనేయడంతో.. అడిగిన వాళ్లు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ఏమైనా ఒక ప్రశ్నకి ఓభారతీయ యువతి ఇంత సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పగలగడం.. గ్రేట్ అనాల్సిందే.