Begin typing your search above and press return to search.
తాచుపాము జెడతో సతీ సావిత్రి..?
By: Tupaki Desk | 14 Dec 2021 5:30 PM GMTఅమెరికా కోడలు ప్రియాంక చోప్రా హాలీవుడ్ ని షేక్ చేసే పనిలో బిజీబిజీగా ఉంది. తాజాగా పీసీ నటించిన `ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్` విడుదకు సిద్ధమవుతుండగా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజా ప్రెస్ ఈవెంట్లో తన `సతీ` రూపాన్ని ప్రదర్శించి చూపరుల దృష్టిని ఆకర్షించింది.
పీసీ అందమైన అల్లికతో ఉన్న మూడు అడుగుల జడను ప్రదర్శించి వావ్ అనిపించింది. తాజా ఇన్ స్టా పోస్ట్ లో ప్రియాంక హెయిర్ విప్ ఫోటోని షేర్ చేసింది. దాదాపు నెయిల్ డ్ లుక్ ని ఈ ఫోటోల బంచ్ లో రివీల్ చేసింది. ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ ప్రెస్ వీక్ లో మొదటి రోజు కోసం పీసీ ప్రిపరేషన్ ఇది. దీంతో పాటు అనేక ఇతర పోస్ట్ లను కూడా షేర్ చేసింది.
ప్రియాంక చోప్రా నీలం -తెలుపు బాడీకాన్ ఫుల్-స్లీవ్ దుస్తులను ధరించింది. అల్లిన హెయిర్ డో (ఆమె సతీ రూపాన్ని పోలి ఉంటుంది),..చెవిపోగులు .. తెల్లటి హీల్స్ ని ఈ కొత్త రూపం కోసం ఎంచుకుంది. ఇన్ స్టాగ్రామ్ రీల్ లో మూడున్నర అడుగుల తాచుపాము లాంటి పొడవాటి ఆ అందమైన జడ మనసును హత్తుకుంటోంది.
ఆమె ప్రెస్ టూర్‌కు సిద్ధమైనప్పుడు ఒక వీడియో క్లిప్ ను కూడా షేర్ చేసింది. కెమెరాకు పోజులిచ్చిన ప్రియాంక తన కొత్త హెయిర్ లుక్ తో అల్లరి చేస్తూ కనిపించింది. కీను రీవ్స్- క్యారీ-అన్నే మోస్ లతో సహా ప్రియాంక తన ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ తారాగణంతో ఈ వీడియో క్లిప్ ముగిసింది. మ్యాట్రిక్స్ ప్రెస్ టూర్ మొదటి రోజు ముగిసింది. #matrixresurrections @thematrixmovie అని ప్రియాంక పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది.
ప్రియాంక తన ఫోటోషూట్ నుండి అనేక చిత్రాలను కూడా పంచుకుంది. ఆమె లెన్స్ కోసం అనేక పోజులు ఇచ్చింది. ఒక ఫోటోలో ప్రియాంక కెమెరా నుండి దూరంగా చూస్తున్న కుషన్ కుర్చీపై కూర్చున్నట్లు కనిపిస్తుంది. పోస్ట్‌పై స్పందిస్తూ, ప్యారిస్ హిల్టన్ గుండె ఈమోజీల్ని షేర్ చేశారు.
గత వారాంతంలో ప్రియాంక తన రాబోయే అమెజాన్ స్టూడియోస్ సిరీస్ సిటాడెల్ చిత్రీకరణను పూర్తి చేసింది. జనవరిలో టీమ్ సిటాడెల్ లో చేరి పీసీ పనిచేయడం ప్రారంభించింది. 39 ఏళ్ల పీసీ ఇన్ స్టాగ్రామ్ లో లండన్ నుండి ప్రదర్శన ఫోటోలు సహా తారాగణం - సిబ్బందితో ఉన్న ఫోటోల్ని పంచుకున్నారు. #సిటాడెల్ పూర్తయింది... అత్యంత తీవ్రమైన సమయంలో ఒక సంవత్సరం మొత్తం అత్యంత తీవ్రమైన పని. ఈ అద్భుతమైన వ్యక్తులు లేకుండా ఇది సాధ్యం కాదు. మీరు ఇక్కడ కొన్నిటిని చూస్తారు. కొన్నింటిని చూడలేరు. ఇది చాలా కష్టమైంది.. అని ఆమె తన పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చింది.
సిటాడెల్ అనేది ఇటలీ- ఇండియా- మెక్సికోలో స్థానిక ప్రొడక్షన్ కంపెనీలతో కూడిన బహుళ-సిరీస్ ఫ్రాంచైజీ. ప్రియాంకతో పాటు రిచర్డ్ మాడెన్ - రోలాండ్ మోల్లెర్ ఈ చిత్రంలో భాగం. సిటాడెల్ ను మాజీ ABC స్టూడియోస్ ప్రెసిడెంట్ పాట్రిక్ మోరన్ -మైక్ లారోకాతో కలిసి రస్సో బ్రదర్స్ నిర్మించారు. ప్రియాంక తదుపరి చిత్రం ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ డిసెంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.