Begin typing your search above and press return to search.

పెళ్లికి లైసెన్స్‌ వచ్చిందట!

By:  Tupaki Desk   |   10 Nov 2018 4:45 AM GMT
పెళ్లికి లైసెన్స్‌ వచ్చిందట!
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా తన ప్రియుడు నిక్‌ జోనాస్‌ ను వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెల్సిందే. పెళ్లికి ఇంకా చాలా సమయం ఉండగానే సందడి మొదలైంది. నిక్‌ జోనాస్‌ అమెరికన్‌ పౌరుడు అవ్వడం వల్ల అతడిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యుల కంటే ముందు అక్కడి అధికారులు పర్మీషన్‌ ఇవ్వాల్సి ఉంటుందట. అమెరికాలో పెళ్లికి అధికారుల నుండి గ్రీన్‌ సిగ్నల్‌ తప్పనిసరి. పెళ్లి చేసుకోవాలనుకునే వారు నెల రోజుల ముందు దరకాస్తు చేసుకుంటే అక్కడ అధికారులు పర్మీషన్‌ ఇస్తారు. ప్రియాంక చోప్రా - నిక్‌ జోనాస్‌ ల వివాహంకు పది రోజుల క్రితం అప్లై చేశారట.

సాదారణంగా నెల రోజులు పట్టే పర్మీషన్‌ ప్రియాంక - నిక్‌ ల వివాహానికి కేవలం పది రోజుల లోపులోనే ఇచ్చారట. ప్రియాంక చోప్రా కుటుంబ సభ్యులు ప్రస్తుతం రాజస్థాన్‌ లోని జోధ్‌ పూర్‌ కోటలో వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే అమెరికా అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందే వీరి పెళ్లికి లైసెన్స్‌ ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పెళ్లికి లైసెన్స్‌ వచ్చిన నేపథ్యంలో అమెరికాలోని స్నేహితులకు ప్రియాంక మరియు నిక్‌ లు పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలో ప్రియాంక మరియు నిక్‌ లు చాలా బిజీగా గడిపేస్తున్నారు. పార్టీలు - పెళ్లి పనులు అంటూ బిజీ బిజీగా ఉన్నారు. జోద్‌ పూర్‌ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెళ్లి వేదికలో ప్రియాంక - నిక్‌ ల వివాహం జరుగబోతుంది. బాలీవుడ్‌ - హాలీవుడ్‌ ప్రముఖులతో పాటు ప్రియాంక - నిక్‌ ల సన్నిహితులు - కుటుంబ సభ్యులు దాదాపుగా రెండు వేల మంది ఈ వివాహ వేడుకలో పాల్గొంటారు అంటూ సమాచారం అందుతోంది.