Begin typing your search above and press return to search.

ప‌క్క‌టెముక విరిగినా కానీ నిక్ వ‌దిలిపెట్ట‌డు!

By:  Tupaki Desk   |   24 May 2021 9:30 AM GMT
ప‌క్క‌టెముక విరిగినా కానీ నిక్ వ‌దిలిపెట్ట‌డు!
X
కేన్స్.. బాఫ్టా.. ఆస్కార్ .. అవార్డులు ఏవైనా అక్క‌డ ప్రియానిక్ జంట వాలిపోవాల్సిందే. ఇప్పుడు మ‌రో ఈవెంట్ లో ఈ జోడీ షోస్టాప‌ర్స్ గా నిలిచారు. ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ 2021 ఎడిషన్ బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డులకు హాజరయ్యారు. ఇక్కడ నిక్ సాయంత్రం ఆతిథ్యమిచ్చారు. అంతే కాదు అతను త‌న క‌జిన్స్ జో జోనాస్- కెవిన్ జోనాస్ .. మార్ష్మెల్లో - జోనాస్ బ్రదర్స్ తాజా సింగిల్ ‘లీవ్ బిఫోర్ యు లవ్ మి’ కి ప్రదర్శన ఇచ్చాడు.

ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ ఈ సాయంత్రం వేడుక‌లో ఎంతో అద్భుతంగా కనిపించారు. ఈ జంట డిజైన‌ర్ లుక్ హృద‌యాల్ని కొల్లగొట్టింది. ముఖ్యంగా పీసీ పూర్తిగా గోల్డెన్ డోల్స్ గబ్బానా దుస్తులు ధరించి కనిపించింది. పీసీ థై స్లిట్ లుక్ అభిమానుల‌కు నిజంగానే ఊపిరాడ‌నివ్వ‌దు. భారీ బంగారు బెల్ట్ నడుముతో బాస్ లాగా కనిపించింది. బల్గారి నుండి వజ్ర ఉపకరణాలతో ఈ డ్రెస్ ని డిజైన్ చేశార‌ట‌. ఆమె డైమండ్ డాంగ్లర్స్ స్నేక్ హారాన్ని ధరించింది. పీసీ గోల్డ్ హీల్స్.. షిమ్మరీ మేకప్ .. పోకర్ స్ట్రెయిట్ హెయిర్ తో లుక్ ప‌రంగా కొత్త‌గా క‌నిపించింది.

నిక్ జోనాస్ ఇటీవ‌లే పక్కటెముక గాయం నుండి కోలుకుంటున్నాడు. అయినా కానీ వేదిక‌పై చూప‌రుల‌ను ఆకట్టుకోవడంలో విఫలం కాలేదు. అతను ఫెండి బ్రాండ్ ఆకుపచ్చ దుస్తుల్లో ఎప్పటిలాగే అందంగా కనిపించాడు. భారీ కాలర్ ఆకుపచ్చ జాకెట్‌తో ఆకుపచ్చ గొలుసు చొక్కా ధరించి కనిపించాడు. ఆకుపచ్చ ప్యాంటు -బ్లాక్ లోఫర్ చెప్పుల‌తో క‌నిపించాడు. జోనాస్ తన సోదరులతో కలిసి కార్పెట్ మీద కనిపించాడు మరియు ప్రియాంకతో కలిసి నటిస్తూ కనిపించాడు. ప్ర‌కృతిలో ఈ శక్తిని పగులిన‌ పక్కటెముక కూడా ఆపదు. చాలా గర్వంగా ఉంది బేబీ. మీరు చేసే ప్రతి పనితో! మీ పని తీరుతో మీరు ప్రతిరోజూ నన్ను ప్రేరేపిస్తారు! అని నిక్ వ్యాఖ్యను జోడించారు.