Begin typing your search above and press return to search.
ప్రియాంక నిక్ ల పెళ్లికి అంతా రెడీ
By: Tupaki Desk | 25 Nov 2018 5:30 PM GMTఇంకా దీపికా పదుకునే రన్వీర్ సింగ్ ల పెళ్లి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్ లో హల్చల్ చేస్తుండగానే మరో సెలబ్రిటీ వెడ్డింగ్ ముంచుకు వస్తోంది. బాలీవుడ్ హాటీ ప్రియాంకా చోప్రా తన విదేశీ ప్రియుడు నిక్ జోనాస్ తో మూడు ముళ్ళు వేయించుకునే ముహూర్తం ముంచుకు వస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ పెళ్లి జోధ్ పూర్ లోని సుప్రసిద్ధ ఉమైద్ భవన్ ప్యాలెస్ లో డిసెంబర్ 1న అంగరంగ వైభవంగా జరగనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాట.
ఇవాళ తెల్లవారుఝామున ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన ప్రియాంకా చోప్రా నిక్ లు బాలన్స్ షాపింగ్ పూర్తి చేసుకుని ఓ రెండు రోజుల్లో జోధ్ పూర్ ప్రయాణం అవుతారు. ప్రియాంక నిక్ లు మొన్న దాకా యుఎస్ లోనే ఉన్నారు. అక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకోవడానికి అవసరమైన మ్యారేజ్ లైసెన్స్ కోసం బెవర్లీ హిల్స్ కోర్ట్ హౌస్ ఆదేశాల మేరకు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఆ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో పాటు వివాహ తేదీ దగ్గర పడటంతో ప్రియాంకా నిక్ ను ఇక్కడికి చేరుకున్నారు.
వివాహ పత్రికలు కూడా పంచడం జరిగింది. నరేంద్ర మోడీ హాజరు కావొచ్చనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. పత్రిక ప్రధాని దాకా చేరిందట. తనకన్నా పదకొండేళ్ళు చిన్నవాడైన నిక్ తో ప్రేమలో పడి పెళ్లి దాకా తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. పెళ్ళయ్యాక ఇద్దరు యుఎస్ లోనే సెటిల్ కాబోతున్నారు. ఇప్పటికే దీని కోసం 50 కోట్ల విలువైన విల్లాను కొని సిద్ధంగా ఉంచాడు నిక్. ఫ్యూచర్ లో సినిమాలు చేసే ఉద్దేశం లేదంటోంది ప్రియాంకా.