Begin typing your search above and press return to search.

ప్రియానిక్ .. మ‌ళ్లీ వ్వావ్ అనిపించారు

By:  Tupaki Desk   |   4 Jun 2019 2:08 PM GMT
ప్రియానిక్ .. మ‌ళ్లీ వ్వావ్ అనిపించారు
X
అమెరికా కోడ‌లుగా ప్రియాంక చోప్రా స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఫ్యాష‌న్ ఈవెంట్ల‌లో మ‌హారాణిగా వెలిగిపోతోంది. భ‌ర్త నిక్ జోనాస్ తో క‌లిసి ఇప్ప‌టికే ప‌లు రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో పీసీ ఫ్యాష‌న్ షో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అప్ప‌ట్లో మెట్ గాలా ఈవెంట్ లో .. ఆ త‌ర్వాత కేన్స్ ఉత్స‌వాల్లో పీసీ- నిక్ జోడీ క‌ళ్లు మిరుమిట్లు గొలిపే స్టైల్ తో అద‌ర‌గొట్టేశారు. కేన్స్ లో ర‌క‌ర‌కాల డిజైన‌ర్ డ్రెస్ ల‌లో ప్రియానిక్ చేతిలో చెయ్యేసి రెడ్ కార్పెట్ పై న‌డిచొస్తూ ఫ్యాన్స్ కి అద్భుత‌మైన ట్రీటిచ్చారు. ఆ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయ్యాయి.

తాజాగా మ‌రోసారి ఈ జంట రెడ్ కార్పెట్ ఈవెంట్ అదే తీరుగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. నిక్ జోనాస్ బ్ర‌ద‌ర్స్ జీవిత క‌థ ఆధారంగా రూపొందించిన ఓ డాక్యుమెంట‌రీని తాజాగా లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ ఈవెంట్ కి ప్రియాంక చోప్రా హ‌బ్బీతో క‌లిసి ఎటెండ‌య్యింది. ఈ వేడుక‌లో ప్రియానిక్ ధ‌రించిన స్పెష‌ల్ డిజైన‌ర్ డ్రెస్ ల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చ సాగింది. ముఖ్యంగా ప్రియాంక చోప్రా సిల్వ‌ర్ క‌ల‌ర్ నెట్ మోడల్ ఇన్ వోర్ ధ‌రించి దానిపై న‌ల్ల రంగు స్టిట్ గౌనుని ధ‌రించింది. ప్ర‌త్యేకించి ఆ సిల్వ‌ర్ నెట్ .. స్టిట్ డిజైన్ గౌనులో ఆ థై షో హైలైట్ అవ్వ‌డంతో ఫ్యాష‌న్ ప్రియులు దాని గురించి ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు. ఇక పీసీకి కాంబినేష‌న్ గా నిక్ జోనాస్ సైతం వైన్ క‌ల‌ర్ జాకెట్ ధ‌రించి అద‌ర‌గొట్టాడు.

జోనాస్ బ్ర‌ద‌ర్స్ జీవితంపై డాక్యుమెంట‌రీ తెర‌కెక్కుతోంద‌న్న వార్త‌లు చాలాకాలంగా వ‌స్తున్నాయి. ఎట్ట‌కేల‌కు ఈ డాక్యుమెంట‌రీ రిలీజైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దీనికి జోనాస్ బ్ర‌ద‌ర్స్ అభిమానుల్లో క్రేజు నెల‌కొంది. పీసీనే హ‌బ్బీ డాక్యుమెంట‌రీకి ప్ర‌మోష‌న్ చేస్తోంది కాబ‌ట్టి అది ఇండియాలోనూ అంతే పాపుల‌రైపోతుంద‌న్న‌మాట‌. భార్య‌ల‌తో క‌లిసి ఇలాంటి వేదిక‌ల‌కు రావ‌డం అన్న‌ది ఒక డ్రీమ్ అంటూ జోనాస్ బ్ర‌ద‌ర్స్ ఇరువురూ ఉబ్బి త‌బ్బిబ్బ‌యిపోతున్నారు. వైఫ్ లు ఇలా వెంట రావ‌డం స‌పోర్ట్ చేయ‌డం ఎంతో ఆనందాన్నిస్తోంద‌ని తెలిపారు.