Begin typing your search above and press return to search.
నా సక్సెస్ క్రెడిట్ నాదే
By: Tupaki Desk | 14 April 2016 1:30 PM GMTసాధారణంగా కెరీర్ లో విజయం సాధించిన వారంతా.. తాము ఈ స్థాయికి చేరడానికి వారు కారణం అని, వీరి సహకారం అని చెబుతూ ఉంటారు. కానీ బాలీవుడ్ హీరోయిన్ ఇలాంటి మాటలకు భిన్నంగా.. తన సక్సెస్ తనకు మాత్రమే చెందుతుందని.. క్రెడిట్ వేరే వాళ్లకి ఎందుకివ్వాలని ప్రశ్నిస్తోంది. ఇందుకు ఆమె చెబుతున్న కారణాలు కూడా కరెక్ట్ గానే ఉన్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ గా సినీ కెరీర్ ప్రారంభించి.. హాలీవుడ్ సీరియల్ క్వాంటికోతో అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు హాలీవుడ్ మూవీ బేవాచ్ లో నటిస్తూ.. తన రేంజ్ మరింత ఉన్నత స్థానానికి చేర్చుకుంది. రీసెంట్ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్న ప్రియాంక చోప్రా.. తాను చిన్నప్పటి లక్ష్యాన్ని నిర్ణయించుకుని అడుగులు వేస్తున్నట్లు చెప్పింది. తన దారిలోకి ఏదైనా అవకాశం వచ్చినపుడు.. దానిపై నిర్ణయం తీసుకునేందుకు తనే కష్టనష్టాలను ఆలోచించుకుని అడుగులు వేశానంది ప్రియాంక. అంతే కాదు.. కెమేరా ముందు నిలబడి నటించేది నేనే కాబట్టి.. నా విజయం క్రెడిట్ నాకే అంటోంది ప్రియాంక చోప్రా.
తాను ఆత్మహత్యా యత్నం చేశానన్న ఈమె మాజీ మేనేజర్ వ్యాఖ్యలపై కూడా తొలిసారిగా స్పందించింది ప్రియాంక. కొంతమంది ఇతరుల సక్సెస్ తమ కారణంగానే అని చెప్పుకుంటూ ఉంటారని.. అలాంటి వారిని లెక్కచేయాల్సిన పని లేదని తేల్చేసింది.