Begin typing your search above and press return to search.

నిక్ సరసం అలా ఉందట!

By:  Tupaki Desk   |   1 Dec 2018 10:11 AM GMT
నిక్ సరసం అలా ఉందట!
X
గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తమ ఏడాది డేటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఈరోజు భార్యాభర్తలుగా మరనున్నారు. ఈరోజు(అంటే డిసెంబర్ 1న) జోధ్‌ పూర్ నగరంలోని ఉమేద్ భవన్ ప్యాలెస్‌ లో వీరి వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమయింది. ఇప్పటికే భారీ సంఖ్యలో అతిథులు అక్కడికి చేరుకున్నారు. వీరి వివాహం డిసెంబర్ 1 న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం.. డిసెంబర్ 2 న హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి జరగనుంది.

ఇదిలా ఉంటే పెళ్ళికి ముందు ప్రియాంక ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్ తో ఎలా లవ్ మొదలైంది.. తమ ఫస్ట్ డేట్ లో ఏం జరిగిందనే విషయాలు వెల్లడించింది. ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోయామని క్లారిటీ వచ్చాక లవ్ ఎక్స్ ప్రెస్ చేసుకున్నామని.. తర్వాత ఏం చేయాలనేది డిస్కస్ చేసుకునేందుకు కలిశామని.. అదే తమ ఫస్ట్ డేట్ అని తెలిపింది.

ఆరోజు నిక్ తనను ముద్దు పెట్టుకుంటాడని ఎక్స్ పెక్ట్ చేశానని కానీ నిక్ అలాంటిదేమీ చేయలేదని తెలిపింది. ఆరోజు పెళ్ళి గురించి.. పెద్దవాళ్ళతో చర్చించి పెళ్ళి ఏర్పాట్లు చేయడం గురించి మాట్లాడుకున్నామని తెలిపింది. ఆరోజు నిక్ రొమాంటిక్ గా ఏమీ లేడని.. కాకపోతే వెళ్తూ వెళ్తూ తన బ్యాక్ ను అలా చేత్తో తడిమి వెళ్ళాడని తెలిపింది. ఇదిలా ఉంటేఏడాది పాటు నిక్ తో గడిపిన సమయం అద్భుతమని.. నన్ను నేను మర్చిపోయేలా నిక్ చేశాడని చెప్పింది. ఒక్కోసారి నిక్ తనపై కురిపించే ప్రేమతో సిగ్గుతో నా బుగ్గలు ఎర్రగా కందిపోయేవని తెలిపింది.