Begin typing your search above and press return to search.
హీరోలకు 100...హీరోయిన్లకు 12...
By: Tupaki Desk | 25 Dec 2015 9:30 AM GMTసినీ పరిశ్రమలో ఆడ - మగ తేడాల గురించి మరో స్టార్ హీరోయిన్ గళమెత్తింది. ఇప్పటికే దీపికా పదుకొనే, కంగనా రనౌత్ లాంటి వాళ్లు హీరోయిన్లకు ఇచ్చే పారితోషకాల విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా ప్రియాంక చోప్రా కూడా ఈ విషయంలో హాట్ హాట్ కామెంట్స్ చేసింది. సినీ రంగంలో ఆడ, మగ తేడా ఎక్కువే అని.. హీరోయిన్ల మీద వివక్ష బాగా ఎక్కువైపోతోందని ఆమె అభిప్రాయపడింది. పారితోషకాల విషయంలో హీరోయిన్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆమె ఆరోపించింది.
పరిశ్రమలో హీరోలకు 100 శాతం రెమ్యూనరేషన్ దక్కుతోందని.. ఐతే హీరోయిన్లకు మాత్రం హీరోలు తీసుకునేదాంట్లో 12 శాతం మాత్రమే పారితోషకంగా దక్కుతోందని ప్రియాంక ఆరోపించింది. ఐతే ఈ పరిస్థితి ఇకముందైనా మారుతుందని తాను భావించడం లేదని ప్రియాంక చెప్పింది.
ఇక వివాదాస్పద అంశాలపై పరిశ్రమలోని వ్యక్తుల్ని టార్గెట్ చేసుకోవడంపై ప్రియాంక మండి పడింది. సెలబ్రెటీలు జనాలకు ఈజీ టార్గెట్ అయిపోయారని వ్యాఖ్యానించింది. మత అసహనం మీద తమ అభిప్రాయాలు చెప్పినందుకు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లపై జనాలు విరుచుకుపడటాన్ని ఆమె తప్పుబట్టింది. సెలబ్రెటీలు అయినంత మాత్రాన తాము తమ అభిప్రాయాలు చెప్పకూడదా అని ప్రశ్నించింది. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందని.. దాన్ని గౌరవించాలని.. ఐతే సినీతారల్ని టార్గెట్ చేసుకుంటే ప్రచారం వస్తుంది కదా అని వారిపై విరుచుకు పడటం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించింది.