Begin typing your search above and press return to search.
పోలీసులు, గంగాజలం ఒకటే
By: Tupaki Desk | 4 March 2016 5:44 AM GMTప్రియాంక చోప్రా మొదటి సారిగా పోలీస్ పాత్రలో నటిస్తున్న మూవీ జై గంగాజల్. దశాబ్దం క్రితం వచ్చిన గంగాజల్ తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. మొదట గంగాజల్ 2 అనే టైటిల్ పెట్టినా, ఆ నిర్మాతల నుంచి అబ్జెక్షన్ రావడంతో జై గంగాజల్ అనే పేరు ఫిక్స్ చేశారు. సమాజంలో బురదని కడగాలంటే స్వచ్ఛమైన గంగాజలం కావాలి కానీ.. మురుగునీరు కాదు అన్నది ఈ మూవీ కాన్సెప్ట్.
ఉత్తర్ ప్రదేశ్ నేటివిటీతో గంగాజల్ మూవీ సాగుతుంది. నడిరోడ్డుపై ఓ ఎస్పీని ఎమ్మెల్యే కొట్టినా కిక్కురుమనని ప్రాంతం అది. అక్కడికి తొలి మహిళా ఎస్పీగా వెళుతుంది ప్రియాంక. నిజాయితీకి లాఠీ ఇచ్చి, ఖాకీ వేస్తే ఎలా ఉంటుందో.. అదే ఈమె కేరక్టర్. ఓ మహిళ తమపై అధికారిణిగా రావడం జీర్ణించుకోలేక... మేడమ్ సార్ అని పిలిచే పోలీసులు ఉంటారక్కడ. తన డిపార్ట్ మెంట్ లో ఉన్న మురికి ఆలోచనలను తన తెగువతో కడిగేసి, ఆ తర్వాత ఎమ్మెల్యేను ఎలా రోడ్డు పైకి ఈడ్చి బుద్ధి చెప్పిందన్నదే జై గంగాజల్ సినిమా స్టోరీ.
ఈ మూవీలో ప్రియాంక చోప్రా చెబుతున్న పవర్ఫుల్ డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. 'ఖాకీ యూనిఫాం రంగు సరిగ్గా ఉంటే చాలు.. దాన్ని మగాడు తొడుక్కునే, ఆడది తొడక్కున్నా తేడా ఏం ఉండదు' అంటూ ప్రియాంక చెప్పిన డైలాగ్ కి ఇప్పటికే హ్యాట్సాఫ్ అంటున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ లోంచి సాలా అనే పదాన్ని తొలగించి కొత్త ట్రైలర్ ను విడుదల చేసింది యూనిట్. ఈ మూవీ ఇవాళే విడుదలై.. పోలీస్ పవర్ చూపించబోతోంది.