Begin typing your search above and press return to search.

ప్రియాంక 'టైం'.. భలేగుందిగా!!

By:  Tupaki Desk   |   21 April 2016 1:30 PM GMT
ప్రియాంక టైం.. భలేగుందిగా!!
X
ప్రియాంక చోప్రా టైం ఇప్పుడు మామూలుగా లేదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సూపర్ సక్సెస్. హాలీవుడ్ లో క్వాంటికో సిరీస్ చేస్తే.. అది బంపర్ హిట్ రాగా.. ఆ తర్వాత అరంగేట్రంలోనే హాలీవుడ్ మూవీ బేవాచ్ లో లీడ్ కేరక్టర్ దక్కింది. రీసెంట్ గా టాప్ టీవీ సెలబ్రిటీగా ఎంపికవడమే కాకుండా.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకుంది.

ఇప్పుడు కేంద్రం నుంచి అతుల్య భారత్ గా రీనేమ్ చేసిన ఇన్ క్రెడిబుల్ ఇండియాకు ప్రచార బాధ్యతలు దక్కించుకోనుందనే టాక్ వినిపిస్తోంది. వీటన్నిటితోపాటు అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన టాప్ 100 మహిళల్లో ఒకరిగా ఎంపికైంది ప్రియాంక చోప్రా. ఓ ఇండియన్ లేడీ.. అమెరికన్స్ ని ప్రభావితం చేసే మహిళగా సెలెక్ట్ కావడం, అది కూడా ఇంటర్నేషనల్ మేగజైన్ టైం ప్రకటించిన జాబితాలో ఉండడం సాధారణ విషయం కాదు.

ఇవన్నీ కాకుండా.. ఏకంగా ఆ 'టైం' మేగజైన్ కవర్ పేజ్ ని ఆక్రమించేసిందంటే.. ప్రియాంక టైం ఎంత సక్సెస్ ఫుల్ గా నడుస్తోందో అర్ధమవుతుంది. గతంలో ఇలా టైమ్ మేగజైన్ కవర్ పేజ్ ను అధిరోహించిన రికార్డ్ ఇద్దరు బాలీవుడ్ నటీమణులకు మాత్రమే ఉంది. అందులో ఒకరు పర్వీన్ బాబీ కాగా.. ఇంకొకరు మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్. ఆ తర్వాత ఈ ఫీట్ ని ప్రియాంకనే సాధించింది. తన సక్సెస్ కు తన కష్టమే కారణమన్న ప్రియాంక మాటలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాల్సిందే.