Begin typing your search above and press return to search.

పీసీ కీ ఆ చేదు అనుభవం తప్పలేదట

By:  Tupaki Desk   |   15 April 2019 6:05 AM GMT
పీసీ కీ ఆ చేదు అనుభవం తప్పలేదట
X
బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ అనే తేడా లేకుండా దాదాపు అందరు హీరోయిన్స్‌ కూడా గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి సమయం వచ్చినప్పుడు చెప్పుకు వస్తున్నారు. మీటూ అంటూ పెద్ద ఉద్యమం మొదలైన నేపథ్యంలో ఎంతో మంది హీరోయిన్స్‌ తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి మీడియా ముందు చెప్పారు. పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ సైతం ఆశ్చర్యకరంగా తాము లైంగిక వేదింపులకు గురయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా కూడా లైంగిక వేదింపులకు గురైన బాధితురాలిగా చెప్పుకొచ్చింది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను మీరు ఎప్పుడైన లైంగిక వేదింపులకు గురయ్యారా అంటూ ప్రశ్నించగా చేయి లేపి మరీ ఔను, నేను లైంగికంగా వేదించబడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ గా కెరీర్‌ మొదలు పెట్టిన సమయంలోనా లేదా మోడలింగ్‌ లో ఉన్న సమయంలోనా అనే విషయంపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కాని తాను కూడా లైంగిక వేదింపుల బాధితురాలినే అంటూ చెప్పుకొచ్చింది.