Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : పీసీ గ్లామర్ ట్రీట్.. పిచ్చోళ్లవ్వాల్సిందే..!

By:  Tupaki Desk   |   4 Nov 2022 8:30 AM GMT
ఫోటో స్టోరీ : పీసీ గ్లామర్ ట్రీట్.. పిచ్చోళ్లవ్వాల్సిందే..!
X
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ప్రమోట్ అయిన ప్రియాంకా చోప్రా.. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లాడిన తర్వాత ఇండియాకు రావడమే మానేసింది. అక్కడ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటున్న అమ్మడు 3 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చింది. ముంబైలో ప్రియాంకా సందడి ఓ రేంజ్ లో కనిపిస్తుంది. ఆమె రాక పీసీ ఫ్యాన్స్ కి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. చాలా గ్యాప్ తర్వాత రావడంతో అమ్మడు తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది.

ఇక ఈ సందర్భంగా ప్రియాంకా చేస్తున్న గ్లామర్ షో మరోసారి హాట్ న్యూస్ గా మారింది. ఇక్కడ సినిమాలు చేసేప్పుడే గ్లామర్ విషయంలో అడ్వాన్స్ గా ఉండే పీసీ ఇక ఇప్పుడు కంప్లీట్ గా హాలీవుడ్ స్టార్ అయ్యాక మారకుండా ఉంటుందా.

అందుకే ముంబై వచ్చినప్పటి నుంచి ప్రియాంకా చోప్రా తన గ్లామర్ ట్రీట్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా అమ్మడు బ్లూ కలర్ బ్లేజర్ బికినీ టాప్ తో దుమ్ముదులిపేస్తుంది. హిందీ సినిమాలు చేసే టైం లోనే ఏ హీరోయిన్ కూడా డేర్ చేయని గ్లామర్ ట్రీట్ తో ఆడియన్స్ ని అలరించిన ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సీరీస్ చేస్తున్న కారణంగా అక్కడ కల్చర్ ని ఇక్కడ చూపించేస్తుంది. ప్రియాంకా చోప్రా సడెన్ గా ఇండియాకు రాడానికి కారణం తన బ్రాండ్ ప్రమోషన్ కోసమని తెలుస్తుంది.

హాలీవుడ్ లో క్వాంటికో సీరీస్ లతో పాపులర్ అయిన ప్రియాంకా చోప్రా ప్రస్తుతం అక్కడ సినిమాలు, వెబ్ సీరీస్ లతో దూసుకెళ్తుంది. కెరియర్ పరంగా అక్కడ అమ్మడికి సాటిస్ఫైడ్ గా ఉందని చెప్పొచ్చు. ఇండియన్ సినిమాల్లో కూడా అమ్మడిని తీసుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా పీసీ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఎంత భారీ రెమ్యునరేషన్ ఇస్తానన్నా సరే ఇండియన్ సినిమాలకు ప్రియాంకా చోప్రా ఆసక్తి చూపించట్లేదు. అక్కడ సీరీస్ లతోనే తన కెరియర్ వెళ్లదీస్తుంది అమ్మడు.

ఓ పక్క హాలీవుడ్ సీరీస్ లను చేస్తూ భర్త నిక్ తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది ప్రియాంకా చోప్రా. పెళ్లైనా సరే తమ పర్సనల్ రొమాంటిక్ ఫోటోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆడియన్స్ కి షాక్ ఇస్తుంటుంది ప్రియాంకా.

తన కన్నా చిన్నవాడైనా నిక్ జోనస్ ని పెళ్లాడిన ప్రియాంకా తన ఫ్యామిలీ లైఫ్ ని సంతోషకరంగా గడుపుతున్నట్టు తెలుస్తుంది. కెరియర్, పర్సనల్ లైఫ్ ఇలా రెండిటిని బ్యాలన్స్ చేస్తూ ప్రియాంకా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.