Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్ సీరియల్.. ఇండియన్సే తీవ్రవాదులు
By: Tupaki Desk | 6 Jun 2018 12:25 PM GMTప్రియాంక చోప్రా టెలివిజన్ సిరీస్ తో.. అమెరికాలో పాదం మోపడమే కాదు.. అక్కడ ఫుల్లు పాపులారిటీ సంపాదించేసుకుంది కూడా. మొదట్లో అంతా బాగానే నడించింది కానీ.. ఇప్పుడు క్వాంటికోకు రేటింగులు ఫుల్లుగా పడిపోయాయి. ఇక క్వాంటికోను నిలిపివేయడం తప్పనిసరి అని.. ఇప్పుడు ప్రసారం అవుతున్న సిరీస్ తో ఈ టీవీ సిరీస్ ఆగిపోతుందని చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో వచ్చిన ఓ ఎపిసోడ్.. జనాలను విస్మయానికి గురి చేసింది. జూన్ 1న క్వాంటికో3 కి సంబంధించిన ఓ ఎపిసోడ్ ప్రసారం అయింది. ఇందులో భాగంగా భారత దేశస్తులు కొందరు పన్నిన ఓ ప్లానింగ్ కు సంబంధించిన కథనం.. అందరికీ షాక్ ఇచ్చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఓ సైంటిస్టుకు యురేనియం లభిస్తుంది. దీంతో ఓ బాంబు తయారు చేయాలని ప్రయత్నిస్తారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఇండో-పాక్ కాన్ఫరెన్సులో దీన్ని పేల్చాలన్నది వారి ఐడియా. అంటే అమెరికాపై ఇండియా అణుబాంబుతో దాడి చేస్తుందన్న మాట.
కానీ పాకిస్తాన్ ఈ బాంబు దాడి చేసినట్లు ప్రపంచాన్ని నమ్మించాలని రుద్రాక్షలు ధరించిన ఇండియన్స్ ఐడియా వేస్తారట. ఈ తరహా ఎపిసోడ్ ను రూపొందించినందుకు మేకర్స్ పై.. దానిలో నటించిందుకు ప్రియాంకపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఎంత పాక్ ను ఇరికించాలంటే మాత్రం.. తన మిత్రదేశమైన అమెరికా పై ఇండియా బాంబు దాడి చేయడం ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఇండియన్స్ ను తీవ్రవాదులు అంటుంటే.. సాటి ఇండియన్ అయిన ప్రియాంక ఎలా ఆ ఎపిసోడ్ చేయడానికి ఒప్పుకుంది అంటూ అందరూ ఆమెను తిట్టిపోస్తున్నారు.