Begin typing your search above and press return to search.
ప్రియాంక చోప్రా పెద్ద గొడవలో ఇరుక్కుంది
By: Tupaki Desk | 10 Jun 2018 4:58 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అనుకోని వివాదంలో ఇరుక్కుంది. ప్రియాంక హాలీవుడ్లో నటిస్తున్న టీవీ సిరీస్ ‘క్వాంటికో’ ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇటీవలే ప్రసారమైన ఒక ఎపిసోడ్లో ప్రియాంక పాత్రను చిత్రించిన తీరు వివాదం రాజేసింది. ఇందులో సీఐఏ ఏజెంట్ పాత్రలో కనిపించిన ప్రియాంక.. ఒక పాకిస్థాన్ ఉగ్రవాదిని పట్టుకుంటుంది. తర్వాత ఆ ఉగ్రవాది మెడలో రుద్రాక్షమాల బయటపడుతుంది. దర్యాప్తులో అతడొక దారితప్పిన భారతీయ ప్రొఫెసర్ అని తేలుతుంది. భారతీయుల్లోనూ ఉగ్రవాదులున్నారు అని ఈ సన్నివేశం సూచించేలా ఉండటంతో వివాదం రాజుకుంది. ఇలాంటి సన్నివేశంలో అభ్యంతరం లేకుండా నటించిన ప్రియాంక మీద సోషల్ మీడియాలో దాడి మొదలైంది.
ప్రియాంక భారతీయుల మనోభావాలను దెబ్బతీశారని.. భారతీయులంటే ఉగ్రవాదుల అన్న భావన ప్రపంచ దేశాల్లో కలగడానికి ఆమె కారణం అయ్యారని జాతీయవాదులు మండిపడుతున్నారు. భారతీయుల అభిమానం ద్వారా స్టార్ అయ్యి.. ఇప్పుడు భారతీయులనే అవమానిస్తున్నావా ప్రియాంకా.. అంటూ ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్లు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. ప్రియాంక మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో ‘క్వాంటికో’ను ప్రసారం చేస్తున్న అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ.. వెంటనే అప్రమత్తం అయింది. భారతీయులకు క్షమాపణ చెబుతూ ‘వాషింగ్టన్ పోస్టు’కు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సన్నివేశానికి సంబంధించి ప్రియాంక తప్పేమీ లేదని.. దాంతో ఆమెకేమీ సంబంధం లేదని.. స్టోరీ లైన్ లో కానీ.. కాస్టింగ్ విషయంలో కానీ ఆమె ప్రమేయం ఏమీ లేదని.. ఒక కల్పిత సన్నివేశంలో ఆమె అనుకోకుండా నటించిందని.. మనసులు గాయపరిచినందుకు క్షమించాలని ఏబీసీ అందులో పేర్కొంది. మరికొన్ని రోజుల్లో ‘క్వాంటికో’ పని ముగించుకుని.. సల్మాన్ హీరోగా తెరకెక్కబోయే ‘భరత్’ షూటింగ్ కోసం ఇండియాకు రావాలని ప్రియాంక చూస్తున్న తరుణంలో ఈ వివాదంలో చిక్కుకోవడం ఆమెకు ఇబ్బందికరమే.