Begin typing your search above and press return to search.

భ‌ర్త‌కు ఆ సేవ చేసి త‌రించాన‌న్న‌ అమెరికా కోడలు

By:  Tupaki Desk   |   14 Jun 2020 4:05 AM GMT
భ‌ర్త‌కు ఆ సేవ చేసి త‌రించాన‌న్న‌ అమెరికా కోడలు
X
ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న‌ పాపుల‌ర్ జంటల్లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న జంట‌. నిక్యాంక‌ సిజ్లింగ్ కెమిస్ట్రీపై యూత్ లో నిరంత‌రం వాడి వేడిగా చ‌ర్చ సాగుతుంటుంది. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో ఉన్న ప్రియాంక లాక్ డౌన్ వేళ తన భర్తతో ఖాళీ సమయాన్ని స‌ద్వినియోగం చేసుకుంది. భ‌ర్తకు అత్త మామ‌ల‌కు సేవ‌లు చేస్తూ స‌మ‌యాన్ని స్పెండ్ చేసింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక నిక్ తో ఓ ఇబ్బందికరమైన రొమాంటిక్ ట్రూత్ ని బ‌య‌ట‌పెట్టేసింది. తీయ‌నైన‌ బెడ్ రూమ్ రహస్యాన్ని అభిమానుల‌కు షేర్ చేయ‌డంతో దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. నిక్ నిదురించే వేళ అత‌డి క‌ళ్ల‌కు మాస్కరా వేస్తుంది. ముఖానికి మాయిశ్చరైజర్ ను పూస్తుంది. ఆ సేవ‌ అద్భుతమైనది... సూపర్ స్వీట్ అని కూడా చెప్పింది పీసీ. అంతేకాదు ఈ స్వీయ నిర్భంధ స‌మ‌యంలో సంగీత వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించాన‌ని నేర్చుకున్నానని వెల్లడించింది. నిక్ తన ఇంటిలో పియానో టీచర్ ‌గా మారిపోయాడ‌ట‌.

తాను ఎప్పుడూ సంగీతం నేర్చుకుంటాన‌ని ఆడగ‌లేదని.. కానీ నేర్చుకోవాల‌నే కోరిక ఎప్పుడూ ఉండేద‌ని పీసీ తెలిపింది. అందుకే ప్రతిరోజూ నిక్ ఆమెకు అరగంట లేదా 45 నిమిషాల పాఠం చెప్పేవాడ‌ట‌. నిక్ ఎన్నో భౌతిక విష‌యాల‌పై శిక్షకుడు .. అంతర్గత రచ‌నా భాగస్వామి అని వెల్ల‌డించింది‌. ప్రియాంక హిప్-హాప్ డాన్స్ క్లాస్ ల‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం తాను రాస్తున్న పుస్తకంలో ఇలాంటి చాలా విష‌యాలు చెబుతోంద‌ట‌.

లాక్ డౌన్ ముందు ఈ జంట భారతదేశంలో ఉన్నారు. కుటుంబం .. స్నేహితులతో హోలీని జరుపుకున్నారు. అప్ప‌టివి చాలా ఛాయాచిత్రాలు ఇంటర్నెట్ ‌లో వైరల్ అయ్యాయి. ముంబైలో కరోనావైరస్ మహమ్మారి విజృంభ‌న వేళ ఈ జంట‌ తిరిగి అమెరికాకు వెళ్లారు.