Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: రొమాన్స్ ఎక్కువ అవుతోందే

By:  Tupaki Desk   |   12 Jan 2019 11:29 AM GMT
ఫోటో స్టొరీ: రొమాన్స్ ఎక్కువ అవుతోందే
X
లాస్ట్ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్న జంటలలో ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ జంట ఒకటి. వారి డేటింగ్ దగ్గరనుండి మొదలు పెట్టి జోధ్ పూర్లో పెళ్ళి జరగడం వరకూ అంతా హాట్ టాపిక్కే. ఆతర్వాత రిసెప్షన్లు.. పోస్ట్ వెడ్డింగ్ పార్టీలు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ జోనాస్ కొత్త జీవితం ప్రారంభించారు.

ప్రియాంక ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ దానికి "తర్వాత.. అతనొక్కడే" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరి ఆ క్యాప్షన్ కు ఎంత డీప్ మీనింగ్ ఉందో మీరే అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇక ఆ ఫోటోలో ఇద్దరూ కపుల్ డాన్స్ చేసే సమయంలో ఇచ్చే.. ఒక రొమాంటిక్ పోజుతో దర్శనమిచ్చారు. నిక్ పీచ్ కలర్ సూట్ లో స్టైల్ గా నిలబడి ప్రియాంక నడుముపై చెయ్యేసి పట్టుకున్నాడు. ఇక మిసెస్ నిక్ జోనాస్ తన భర్తకు దగ్గరగా నిలబడి తన ఎడమచేతిని అయన మెడకు దగ్గరగా పెట్టింది. ప్రియాంక ఒక లైట్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఉన్న గౌన్లో బ్యూటిఫుల్ గా ఉంది.

మీరు కనక ఫోటోను కొంచెం పరిశీలనగా చూస్తె నిక్కు గారు ఎడమ చేతిలో ఓ సిగార్ పట్టుకుని ఉండడం కనిపిస్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనించారో లేదో తెలీదు గానీ ఫోటోను మాత్రం ఫుల్లుగా లైక్ చేశారు. పోస్ట్ చేసిన పదహారు గంటల్లోనే 2.9 మిలియన్ లైక్స్ వచ్చాయి.