Begin typing your search above and press return to search.

దీపికా ఏడుపుపై ప్రియాంక సెటైర్?

By:  Tupaki Desk   |   9 May 2017 9:47 AM GMT
దీపికా ఏడుపుపై ప్రియాంక సెటైర్?
X
దీపికా పడుకొనే ప్రియాంకా చోప్రా ఇప్పుడు బాలీవుడ్ మరియు హాలీవుడ్ సినిమాలతో తెగ సందడి చేస్తున్నారు. ఇద్దరూ బాలీవుడ్లో కలిసి పనిచేసినప్పుడు వాళ్ళ మధ్య గట్టి పోటీ ఉండేది. వాళ్లు ఇప్పుడు హాలీవుడ్ లో పని సంపాదించారు. మరి వాళ్ళ వైరాలు కూడా అలానే పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రియాంక మాటల వింటుంటే అది నిజం అనే అనుకోవాలి.

ఈమధ్యనే మెట్ గళా ఈవెంట్లో వీరు వేసుకున్న డ్రెస్స్ పైన వచ్చిన విమర్శలు మంచి వార్తలుగా మారాయి. ప్రియాంకా సినిమా బేవాచ్ విడుదల కాలేదు ఇంకా. దీపికా సినిమా xxx 3 విడుదలైంది. ఈ సందర్భంగా అమెరికాలోకి జాతివివక్ష గురించి దీపిక మాట్లాడుతూ.. "మీడియా ఈ విషయం లో కాస్త వివేకం తో ఆలోచించాలి. మీడియా వాళ్ళు మనుషులును కాదు.. వాళ్ళ పనిని చూడాలి” అంటూ కామెంట్ చేసింది. ఇదే కామెంట్ పై అసలు ప్రియాంక ఎలా స్పందిస్తుంది అని చూస్తే.. ఆమె స్పందన కాస్త సెటైరికల్ గా ఉంది.

“నేను మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు నన్ను ఎవ్వరూ గుర్తుపడతారని నేను అనుకోలేదు. నేను ఇండియా లో ఫేమస్ అయితే ఇక్కడ అమెరికా వాళ్ళు గుర్తుపట్టాలి అనుకోవడం మూర్ఖత్వం కదా” అంటూ కామెంట్ చేసింది ప్రియాంక. ఈ మాట పట్టుకొని మన బాలీవుడ్ మీడియాలో ప్రియాంక ఇప్పుడు దీపికను సపోర్ట్ చేసిందా దెప్పు పొడుస్తుందా అంటూ తెగ రాసిపాడేశారు. చూస్తుంటే ప్రియాంక ఇలాంటి క్రేజ్ కోసం అలాంటి కామెంట్లు చేసినట్లుంది.