Begin typing your search above and press return to search.
ఎటకారంపై ప్రియాంక పిచ్చ హ్యాపీ
By: Tupaki Desk | 4 May 2017 5:21 AMన్యూయార్క్ లో జరిగిన మెట్ గాలా ఈవెంట్ లో ప్రియాంక చోప్రా డ్రెసింగ్.. ఆన్ లైన్ లో విపరీతమైన వెటకారానికి గురయింది. లెక్కకు మించిన ప్రశంసలు.. బోలెడన్ని కామెంట్స్.. లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. అయితే.. మెట్ గాలా ఈవెంట్ లో ప్రియాంక వస్త్రధారణ ఎక్కువగా కామెడీకే గురయింది.
తనపై వచ్చిన విమర్శలను పిగ్గీఛాప్స్ లైట్ తీసుకుంటుందని అంతా అనుకుంటే.. ఈమె మాత్రం సీరియస్ గానే ఫ్లాట్ అయిపోయానంటోంది. జనాల క్రియేటివిటీలో తనకు నచ్చిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది పీసీ. నేల మీద తారాడుతున్న ప్రియాంక డ్రెస్ పై ఓ ఎడారి-పిరమిడ్స్ ను డిజైన్ చేసిన ఫోటో.. టూంబ్ రైడర్ టైపులో టెంట్ రైడర్ అంటూ మార్ఫింగ్ చేసిన పిక్చర్.. కార్ ని కప్పే కవర్ గా ఉపయోగిస్తున్నట్లుగా ఉన్న పిక్చర్.. పిక్నిక్ స్పాట్ లో బ్లాంకెట్ గా ఉన్న పిక్.. తేనీటిపై తరకగా మార్చేసిన వైనం.. బంగాళదుంప వలుస్తున్న ఫోటోలు తనకు తెగ నచ్చేశాయంటోంది ప్రియాంక చోప్రా.
'మీ క్రియేటివిటీకి ఫ్లాట్ అయిపోయా.. నాకు నచ్చిన కొన్నింటిని సెలక్ట్ చేసుకున్నా. డ్రస్సులు కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాకుండా.. మరిన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి క్రియేటివిటీ మరింతగా కొనసాగిస్తారని ఆశిస్తున్నా. ఫ్యాషన్ ని ఏ స్థాయికి అయినా తీసుకెళుతుందనే మెట్ గాలా అంటే నాకు అంత ఇష్టం' అంటోంది పీసీ. తనపై వెటకారాన్ని కూడా పిచ్చ హ్యాపీగా పిగ్గీ ఛాప్స్ ఎంజాయ్ చేసేస్తుండడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/