Begin typing your search above and press return to search.
భావనకు ప్రేమతో ప్రియాంక: వైరల్ వీడియో
By: Tupaki Desk | 22 Jan 2018 11:19 AM GMTసినిమా తారల పెళ్ళిళ్ళు జరగడంలో విశేషం ఏమి లేదు కాని ఒక సౌత్ ఇండియన్ హీరొయిన్ పెళ్ళికి బాలీవుడ్ స్టార్ హీరొయిన్ అదే పనిగా ప్రత్యేకంగా వీడియో మెసేజ్ లో విష్ చేయటం అంటే చిన్న విషయం కాదుగా. కేరళలో ఇవాళ నటి భావన వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆర్భాటం లేకుండా అతి తక్కువ జన సందోహం మధ్య గుళ్ళో చేసుకున్నప్పటికీ వాటి తాలుకు ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ప్రియాంకా చోప్రా ఒక వీడియో మెసేజ్ పోస్ట్ చేస్తూ అందులో భావనకు సందేశం ఇచ్చింది. అందులో తనకు హార్దిక వివాహ శుభాకాంక్షలు అని చెబుతూ నీ జీవితంలో వేయబోతున్న అతి పెద్ద అడుగుకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టు పేర్కొంది. నీలాంటి ధైర్యవంతురాలు, ధీశాలి, అచ్చెరువొందేలా చేసే నిన్ను నేను ఎల్లప్పుడు స్పూర్తిగా తీసుకుంటాను అని చెప్పి ముగించింది.
ఇప్పుడు ఈ ప్రియాంకా చోప్రా వీడియో వైరల్ గా మారుతోంది. భావనకు ప్రియాంకా చోప్రాతో అంత ఫ్రెండ్ షిప్ ఉందనే విషయం తెలుసుకుని భావన ఫాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్ తారలకు ఇక్కడి వాళ్ళతో చాలా తక్కువ స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఉన్నా కూడా ఇంత ఓపెన్ హార్ట్ తో బయటపడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రియాంకా చోప్రా చేసిన ఈ వీడియో మెసేజ్ ఒక చక్కని ట్రెండ్ కు శ్రీకారం చుడుతుంది అని చెప్పొచ్చు. కన్నడ నిర్మాత నవీన్ ను ఇష్టపడి ఐదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న భావన ఈ రోజు ఎట్టకేలకు పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది.
గత ఏడాది కేరళ సినిమా పరిశ్రమను కుదిపేసిన లైంగిక వేధింపుల ఇష్యూ లో భావన చూపిన తెగువ అన్ని బాషా నటీనటులను ఆకర్షించింది. అందరు తనకు బాసటగా నిలిచారు. తనకు జరిగిన అవమానం ఏ మాత్రం మొహమాటపడకుండా బయట పెట్టిన తీరు ప్రియాంకా చోప్రాను కూడా కదిలించింది. అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఇప్పుడు ఈ వీడియో తో ఇద్దరు మధ్య ఫ్రెండ్ షిప్ ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసివచ్చింది.