Begin typing your search above and press return to search.
20 ఏళ్ల క్రితం జ్ఞాపకాల్లోకి యూనివర్శిల్ స్టార్ ఫ్యామిలీ
By: Tupaki Desk | 27 Oct 2020 10:30 AM GMT2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ గా ప్రియాంక చోప్రా ఎన్నిక అయ్యింది. ఆ సమయంలో ప్రియాంక చోప్రా గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. మిస్ వరల్డ్ తో హీరోయిన్ గా ప్రియాంక కెరీర్ ను ప్రారంభించింది. తక్కువ సమయంలోనే యూనివర్శిల్ స్టార్ గా పేరు దక్కించుకుంది. బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాల్లో కూడా వరుసగా ఆఫర్లు దక్కించుకున్న ప్రియాంక చోప్రా ఏ ఇండియన్ హీరోయిన్ చేయనన్ని హాలీవుడ్ పాత్రలను చేసి అరుదైన ఘనత దక్కించుకుంది. హాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రియాంక చోప్రా తనకు మిస్ వరల్డ్ కిరీటం వచ్చిన రోజును గుర్తు చేసుకుంది. ఆ రోజున తన కుటుంబ సభ్యుల ఫీలింగ్స్ ఏంటీ అనే విషయాలను కూడా తాజా చిట్ చాట్ ద్వారా వెళ్లడయ్యింది.
మిస్ వరల్డ్ నాటి రోజు వీడియోను షేర్ చేసిన ప్రియాంక చోప్రా అప్పుడు నాకు 18 ఏళ్లు నిండాయి. నేను స్టేజ్ పై ముగ్గురు ఫైనలిస్ట్ లతో ఉన్న సమయంలో నా పేరు ప్రకటించిన వెంటనే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. ఆ సమయంలో అమ్మ నా వద్దకు వచ్చి బేబీ ఇప్పుడు చదువు పరిస్థితి ఏంటీ అంటూ నన్ను ప్రశ్నించింది అంటూ ఇన్ స్టాలో పేర్కొంది. ఆ సందర్బంగా గురించి ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందిస్తూ ముగ్గురు ఫైనలిస్ట్ లో నీ పేరు ప్రకటించిన వెంటనే అంతా చప్పట్లతో మారు మ్రోగింది. ఆ సమయంలో నేను చాలా భావోద్వేగంకు లోనయ్యాను. నాకు కన్నీళ్లు వచ్చాయి. ఆ ఆనందకరమైన సమయంలో బేబీ ని చదువు గురించి ఏంటీ అంటూ ఒక స్టుప్పిడ్ ప్రశ్న వేశాను అంటూ నవ్వేసింది.

ప్రియాంక చోప్రా మరియు ఆమె తల్లి మధు చోప్రాతో పాటు ఆమె సోదరుడు కూడా ఆ రోజు జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. ఆ సమయంలో నేను 11 లేదా 12 ఏళ్ల వయసులో ఉండి ఉంటాను. నాకు ఆ రోజు బాగా గుర్తు ఉంది. నీకు ఆ కిరీటం పెట్టగానే చాలా సంతోషించాను. ఆ తర్వాత వెంటనే నేను అమెరికాకు చదువు కోసం వెళ్లాల్సి ఉందని గుర్తు చేసుకున్నాడు. మొత్తానికి ఆ రోజు అందరికి చాలా ప్రత్యేకమైనదిగా ప్రియాంక చోప్రా పేర్కొంది.