Begin typing your search above and press return to search.

హాలీవుడ్ కోసం బాలీవుడ్‌ కి టాటా!

By:  Tupaki Desk   |   31 July 2018 6:00 AM
హాలీవుడ్ కోసం బాలీవుడ్‌ కి టాటా!
X
ఏరు దాటాక తెప్ప త‌గ‌లేసే బ్యాచ్ గురించి ప‌చ్చిగా మాట్లాడుకుంటాం. ఆ మాట‌కొస్తే టాలీవుడ్‌ కి టాటా చెప్పి - బాలీవుడ్‌ ని హ‌గ్ చేసుకున్న ఇలియానా - తాప్సీ లాంటి క‌థానాయిక‌లు చేసిన త‌ప్పును చాలామంది తిట్టిపోశారు. అయితే ఇది కెరీర్ గేమ్ కాబ‌ట్టి ఎవ‌రూ ఎవ‌రినీ హ‌ర్ట్ చేసేంత‌గా తిట్టేయ‌రు. ఇక‌పోతే బాలీవుడ్ లో ఈ త‌ర‌హా బ్యాచ్ చాలామందే ఉన్నారు. ఇప్పుడు అదే బాట‌లో పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ కి టాటా చెప్పి - హాలీవుడ్ వెళ్లిపోయేందుకు ప్లాన్ చేసుకుంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.

వాస్త‌వానికి ఈ అమ్మ‌డు గ‌త కొంత‌కాలంగా విదేశీ బోయ్‌ ఫ్రెండ్ నిక్ జోనాస్‌ తో స‌ర‌స‌ర‌స విలాసాల్లో మునిగి తేల‌డం వెన‌క చాలానే స్టాటిస్టిక్స్ ర‌న్ అవుతున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇదేదో కేవ‌లం ప్రేమ‌లో ప‌డి ఆడుతున్న ప్రేమాటే అనుకుంటే పొర‌పాటే. దీనివెన‌క బిలియ‌న్ డాల‌ర్ గేమ్ ప్లాన్ ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. విదేశీ న‌టుడు నిక్ జోనాస్‌ ని పెళ్లాడాక అటుపై ప్రియాంక హాలీవుడ్‌ కే అంకిత‌మ‌వుతుంది. అక్క‌డ త‌న స్వేచ్ఛా జీవ‌నాన్ని సాగిస్తుంది. ఒక హాలీవుడ్ స్టార్‌ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా నీరాజ‌నాలు అందుకుంటుంది. దీనర్థం ఇక బాలీవుడ్ కి టాటా చెప్పేయ‌డ‌మే. అందుకే తొక్క‌లో బాలీవుడ్ అని భావిస్తోంది పీసీ. మొన్న‌టికి మొన్న స‌ల్మాన్ భాయ్ భ‌ర‌త్ చిత్రంలో అవ‌కాశాన్ని తృణ‌ప్రాయంగా తూచ్ కొట్టేసింది అంటే అంత పెద్ద గేమ్ ప్లాన్ చేసింది కాబ‌ట్టే. ఇప్పుడ‌ర్థ‌మైందా? వ్వాటే మిరాక్యుల‌స్ బిలియ‌న్ డాల‌ర్ గేమ్ ప్లేయ‌ర్ పీసీ!!