Begin typing your search above and press return to search.

సిక్కిం ప్రభుత్వంతో ప్రియాంకకేంటి గొడవ?

By:  Tupaki Desk   |   15 Sep 2017 5:39 AM GMT
సిక్కిం ప్రభుత్వంతో ప్రియాంకకేంటి గొడవ?
X
బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి. బికినీల్లో హాట్ హాట్ గా తన అందాలను వేడిగా వడ్డించిన ప్రియాంకా చోప్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెకు చేటు తెచ్చేలా ఉన్నాయి. అమ్మడు ఇటీవల ఒక చిత్రాన్ని నిర్మించింది. సిక్కిం నుంచి వలస వెళుతున్న క్రమంలో ఇద్దరు చిన్నారుల మనోభావాల నేపథ్యంలో ‘పహూనా’ అనే సినిమా తీశారు.ఈ చిత్రాన్ని తాజాగా టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ప్రదర్శించారు. మంచి సినిమా తీశారంటూ అక్కడి వాళ్ల ప్రసంశలు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో అమ్మడు నోటికొచ్చినట్లు మాట్లాడేసింది. ‘‘ఈ చిత్రాన్ని మేము సిక్కింలో తెరకెక్కించాం. అక్కడ గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి. పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉంటాయి. అయినా మేం ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. అక్కడ అసలు సినిమాలు నిర్మించడానికి కావాల్సిన వసతే లేదు'' అంటూ చెప్పుకొచ్చింది. ఇదే ఇప్పుడు ఈ శృంగార భామ మెడకు చుట్టుకుంటోంది.

వాస్తవానికి మనదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉండే రాష్ర్టం సిక్కిం. కానీ దీనికి విరుద్ధంగా ప్రియాంకా మాట్లాడటంతో సోషల్ మీడియాలో ఆమెపై విరుచుకపడ్డారంట సిక్కిం వాసులు. "అక్కడ సినీ పరిశ్రమ లేదని నీకు ఎవరు చెప్పారు? ఇప్పటికే అక్కడ చాలా సినిమాలొచ్చాయి. మీది అక్కడ మొదటి చిత్రమా? అంటూ ఆమెను ఒక రేంజ్ లో ఫుట్ బాల్ ఆడుకున్నారు. సిక్కిం అల్లకల్లోలంగా ఉందని మీకు ఎవరు చెప్పారు'' అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. వాస్తవానికి ఈ ఏడాది అక్కడ విడుదలైన సినిమాల్లో ‘ధోక్బు’ పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.

మరి.. ఇండియా టు హాలీవుడ్‌ దాకా ఎదిగిన ఈ డస్టీ బ్యూటీ ఈ విషయం ఎందుకు తెలుసుకోలేకపోయిందో? ప్రియాంక మాటలకు సిక్కిం ప్రభుత్వం కూడా నొచ్చుకుంది. టూరిజం మీద ఆధారపడే సిక్కింలాంటి రాష్ట్రం గురించి ప్రియాంక చేసిన వ్యాఖ్యలు సరికావని ఆ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఉగెన్‌ పేర్కొన్నారు. ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా తల్లి మధు చోప్రా ఫోన్‌ ద్వారా క్షమాపణలు చెప్పారని తెలుస్తోంది. చూశారుగా.. పెదవి దాటితే మాట ఫృథ్వి దాటినట్లే అని ఎందుకన్నారో.