Begin typing your search above and press return to search.

ఫస్ట్ ఛాన్స్ కొట్టేసిన కొత్త పెళ్లి కూతురు

By:  Tupaki Desk   |   30 Nov 2018 9:30 AM GMT
ఫస్ట్ ఛాన్స్ కొట్టేసిన కొత్త పెళ్లి కూతురు
X
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ప్రియాంకా చోప్రా కాబోయే భర్త నిక్ తో కలిసి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో బిజీగా ఉంది. డిసెంబర్ 3 వివాహ తేదీ అని లీక్ అయినప్పటికీ అధికారికంగా మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. జోధ్ పూర్ లోని ఓ ప్యాలెస్ లో జరగబోయే వేడుక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. రిసెప్షన్ ముంబైలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రియాంకా చోప్రాకు మరో అరుదైన అవకాశం దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వోగ్ జనవరి ఎడిషన్ కు ప్రియాంకా చోప్రా కవర్ పేజ్ గా రాబోతోంది. ఈ ఘనత దక్కించుకున్న మొదటి భారతీయ మహిళగా పిసి ఛాన్స్ కొట్టేసింది.వీటి తాలూకు ఫోటో షూట్లను సోషల్ మీడియా వోగ్ సంస్థ షేర్ చేసుకుంది. ధగధగలాడే బంగారు వర్ణం గౌన్ లో క్లీవేజ్ ని టెంప్ట్ అయ్యేలా చూపిస్తున్న ప్రియాంకా ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రియాంకా చోప్రా నిజంగానే పిచ్చ గ్లామరస్ గా ఉంది ఈ ఫోటో షూట్స్ లో. టోన్నీ గూడ్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కి లైబోవిజ్ ఫోటోగ్రఫీ అందించారు. ప్రియాంకా నిక్ ల పెళ్ళైపోయాక ఇద్దరూ అమెరికాలోనే సెటిల్ కాబోతున్నారు. ప్రియాంకా నటించిన రెండు హాలీవుడ్ సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. వెబ్ సిరీస్ ద్వారా అక్కడ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంకా చోప్రా ఇక్కడ కూడా సినిమాలు తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు కానీ అది కార్యరూపం దాల్చడానికి కొంత టైం పట్టేలా ఉంది