Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ప్రియమైన అందాలు

By:  Tupaki Desk   |   5 Sep 2017 5:24 AM GMT
ఫోటో స్టోరి: ప్రియమైన అందాలు
X
మోడల్ గా జీవితాన్ని మొదలు పెట్టిన కొన్ని రోజులకే 2000వ సంవత్సరం లోనే మిస్ ఇండియగా మరియు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న బ్యూటీ ప్రియాంక చోప్ర. ఇక మరి కొన్నీ రోజులకే బాలీవుడ్ వెండితెరపై తనదైన శైలిలో సినిమాలు చేసి నేషనల్ అవార్డులతో పాటు కొన్ని పురస్కారాలను కూడా అందుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన 'ఫ్యాషన్' సినిమా చాలా పెరు తెచ్చిపెట్టింది.

ఇక ఆమె పడిన కష్టానికి ఫలితంగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాకుండా తన అందాలతో హాలివుడ్ ని ఆకర్షించి అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎక్కువగా బుల్లితెరపై అక్కడ టార్గెట్ పెంచింది. అయితే ప్రియాంక అప్పుడప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లలో కూడా తన అందాలను ప్రదర్శిస్తోంది. రీసెంట్ గా వోగ్ అనే మ్యాగజైన్ కి కూడా ప్రియాంక ఇచ్చిన ఫోటో షూట్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇంతకుముందు బికినీ అందాలు ఎన్ని అరబోసిన ఇప్పుడు అమ్మడు ఇచ్చిన స్టిల్స్ చూస్తుంటే మతిపోతోంది. అందమైన పెదాలకి ఇంకా అందాన్ని ఇచ్చిన ఎర్రటి లిప్ స్టిక్ తో అలాగే మెరుస్తున్న డ్రెస్ తో ప్రియాంక ఫోజులకు ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే.

ఇక ఈ అమ్మడు బాలివుడ్ కంటే హాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమె రెండు హాలీవుడ్ సినిమా షూటింగ్స్ లలో బిజిగా ఉంది. కాకపోతే మన దేశ వ్యోమగామి (ఆస్ర్టోనాట్) రాకేశ్‌ శర్మ జీవితంలపై అమీర్ ఖాన్ హీరోగా తీయనున్న సినిమాలో ఆమె రాకేశ్‌ భార్యగా నటిస్తోంది. అది సంగతి.