Begin typing your search above and press return to search.

పీసీ కోడ‌లు అయ్యాకే అమెరికాకు ఇలా అయ్యిందేమిటో!

By:  Tupaki Desk   |   12 May 2020 8:50 AM GMT
పీసీ కోడ‌లు అయ్యాకే అమెరికాకు ఇలా అయ్యిందేమిటో!
X
ప్రియాంక చోప్రా అలియాస్ పీసీ అమెరికా కోడ‌లు అయ్యాక సోష‌ల్ మీడియాల్లో మ‌రింత‌గా ఫాలోయింగ్ పెరిగింది. భ‌ర్త స‌హా అత్తింటి వ్య‌వ‌హారాల్ని నిరంత‌రం ఇన్ స్టా మాధ్య‌మంలో రివీల్ చేస్తూ ల‌క్ష‌లాది ఫాలోవ‌ర్స్ ని పెంచుకోవ‌డంలో స‌ఫ‌ల‌మైంది. ఇక నిరంత‌రం భ‌ర్త నిక్ జోనాస్ తో త‌న లైఫ్ ఎలా ఉన్న‌ది చేర‌వేస్తూనే ఉంది. ప్ర‌స్తుతం క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో క్వారంటైన్ లో ఉన్న‌ప్ప‌టి ఫోటోల్ని ఫ్యాన్స్ కి షేర్ చేసింది.

అయితే అల్లుడు కూతురు అమెరికాలో ఉండ‌డంతో ఇండియాలోని పీసీ మ‌మ్మీ మ‌ధు చోప్రా తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ట‌. అంతేకాదు.. అల్లుడు గారు క్షేమంగా ఉన్నారా? అంటూ ప్ర‌తిసారీ పీసీని క్షేమ స‌మాచారం కోసం షంటేస్తోంద‌ట‌. ఆయ‌న క్షేమ‌మే.. నేను కూడా ఆరోగ్యంగానే ఉన్నాను అని పీసీ చెబుతోంది. తాజాగా ఓ డిజైన‌ర్ మాస్క్ ని ధ‌రించి పీసీ షేర్ చేసిన ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

అమెరికాలో జీవితం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటోందని పీసీ సందేశం ఇచ్చింది. అయితే అమెరికాలో కరోనావైరస్ మహమ్మారి కారణంగా 80 వేల‌ మందికి పైగా మరణించారు. ల‌క్ష‌లాది మంది వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్ప‌ట్లో మామూలు స్థితి సాధ్య‌మేనా అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త లేదింకా.

తాజా సెల్ఫీని ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో షేర్ చేసిన‌ ప్రియాంక క్యాప్షన్ ‌లో ఇలా రాసింది. ``కళ్ళు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండవు. 2 నెలల త‌ర్వాత‌ ముసుగులు తీసేయ‌బోతున్నా.. ధన్యవాదాలు`` అంటూ స‌ర‌దా వ్యాఖ్య‌ను జోడించింది. దీనికి డిజైనర్ మనీష్ మల్హోత్రా రిప్లయ్ ఆస‌క్తిక‌రం. ``మీ కళ్ళు ఎప్పుడూ మెరుస్తాయి`` అంటూ మ‌నీష్ జోక్ చేశారు. ``ఇది మా రియాలిటీ.. ఇది వెర్రి అనిపిస్తుంది. చుట్టూ ఎంద‌రు ఉన్నా మేం ఇంట్లోనే ఉంటున్నాం. ప్ర‌భుత్వం సిఫార్సు చేసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేం సురక్షితంగా ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నాం. సామాజిక దూరాన్ని పాఠిస్తున్నాం`` అని పీసీ అంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో త‌న అత్త‌గారైన డెనిస్ జోనాస్ ను కౌగిలించుకోలేక‌పోయింద‌ట‌. మదర్స్ డే సందర్భంగా ``నా తల్లిని .. నా అత్తను కౌగిలించుకోలేక పోవడం లోటుగా అనిపించింది. భారంగానూ ఉంది`` అంటూ విచారం వ్య‌క్తం చేసింది. అదంతా స‌రే కానీ.. పీసీ కి వ‌చ్చే ఏడాది అయినా అలాంటి అరుదైన ఛాన్స్ ఉంటుందా? అంటే ఏమో!! అయినా తాను అమెరికా కోడ‌లు అయ్యాకే ఇలా ఎందుక‌య్యింది! అంటూ యూత్ ఒక‌టే డిబేట్ స్టార్ట్ చేశారు.