Begin typing your search above and press return to search.
దేవతలు-దేవదూతలు.. పీసీ హొయలు
By: Tupaki Desk | 8 May 2018 11:06 AM GMTహాలీవుడ్ స్టార్ గా ఎదిగిన పీసీ మరోసారి అంతర్జాతీయ స్థాయి రెడ్ కార్పెట్ పై విభిన్నంగా మెరిశారు. ప్రతి ఏటా న్యూయార్క్‌లో జరిగే మెట్ గాలా 2018లో ఆమె వినూత్న డ్రెస్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ముదురు కుంకుమ రంగు వెల్వెట్ డ్రెస్ లో ఆమె అందరి చూపును తనవైపు తిప్పుకుంది. రెడ్ కార్పెట్ పై మెరిసిన ఈ భారతీయ అందాన్ని పొగడకుండా ఎవరు మాత్రం ఉండగలరు.
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ - కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ తో కలిసి ఏటా మెట్ గాలా ఫ్యాషన్ పరేడ్ ను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటీనటులంతా విభిన్నంగా తయారై వచ్చి ఫోటోలకు ఫోజులిస్తారు. ఈ సారి మెట్ గాలా థీమ్ దేవతలు-దేవదూతలు. అందుకే అందరూ దేవదూతలను తలపించే దుస్తుల్లో మెరిసిపోయారు. కేటీ పెర్రీ - రిహాన్న - కిమ్ కదర్షియన్ వంటి హాలీవుడ్ అగ్రతారలు పోప్ దుస్తుల్లో... ఏంజెల్ దుస్తుల్లో వచ్చారు. ఇక ప్రియాంక ప్రముఖ డిజైనర్ రాల్ఫ్ లారెన్ తీర్చిదిద్దిన గౌనులో జతగా తలకు మెడకు పెట్టిన బంగారు ఆభరణాలతో మెరిసిపోయింది. తలకు చుట్టుకున్న హెడ్ గేర్ ను చేతిలో తయారు చేశారు. బీడ్స్‌ను స్వరోస్కీ క్రిస్టల్స్ ను కూర్చుకుంటూ దానిని తయారుచేయడానికి దాదాపు 250 గంటలు పట్టిందట రాల్ఫ్‌కు. ఇదే కార్యక్రమంలో దీపిక పదుకునే కూడా మెరిసింది.
ప్రియాంక క్వాంటికో సిరీస్ తో హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సిరీస్ హిట్ కొట్టడంతో హాలీవుడ్ లో స్థిరపడిపోయింది ప్రియాంక. ఆ తరువాత బేవాచ్ సినిమాలో విలన్ గా నటించింది. ఇండియాలో కన్నా న్యూయార్క్ లోనే ఎక్కువగా ఉంటోంది. మెట్ గాలా కార్యక్రమం కూడా న్యూయార్క్‌లోనే జరిగింది. మెట్ గాలా కార్యక్రమం విరాళాలను సేకరిస్తారు. వచ్చిన వాటిని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తారు.