Begin typing your search above and press return to search.
'నేను చక్రంలో పడిన చిట్టెలుకను కాదు.. క్రియేటివ్' అంటున్న గ్లోబల్ బ్యూటీ
By: Tupaki Desk | 18 Feb 2021 1:30 PM GMTగ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎప్పుడు వార్తలలో కనిపించినా అది సంచలనమే అవుతుంది. ప్రియాంక చాలా క్రియేటివిటీ కలది. అందుకే నిర్భయంగా ఇటు ఇండియాలో అటు విదేశాలలో తన సినీ కెరీర్ ఎంజాయ్ చేస్తోంది. అమ్మడు కొన్నేళ్లుగా చెప్పుకుంటూ వస్తోంది ఏంటంటే.. తను అవకాశాల కోసం ఒక్కచోటే అతుక్కొని కూర్చోలేదు. తనపై తనకున్న నమ్మకంతో అవకాశం ఎక్కడైనా పొందగలను అంటోంది. కొన్నేళ్లుగా నేను ఎక్కడ అవకాశాలు పొందగలనో నాకు నమ్మకం ఉంది. గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ గురించి నాకు తెలియదా.. అందుకే నేను నిర్భయంగా ఉన్నానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ప్రియాంక.
అలాగే నేనిప్పుడు ఒకేచోట, ఒకే ధోరణికి అంటిపెట్టుకొని ఉండాలని లేదు. ఎంత సురక్షితంగా ఉన్నా సరైన మార్గం ఇది కాదని అనిపిస్తుంది. నేనేం చక్రంలో పడిన చిట్టెలుకను కాదు. నాకంటూ ఉన్న క్రియేటివిటీతో స్వేచ్ఛగా నాకు నచ్చిన పనులు చేయాలనీ అనుకుంటున్నాను. అంతేగాక తనకున్న సామర్థ్యంతో బయటికి చెప్పాలనుకుంటుంది. నాకు కథ చెప్పడం ఎలాగో తెలుసు ఆ అడ్వాంటేజ్ తోనే ఇప్పుడు ఈ ఛాన్స్ తీసుకున్నాను. చాలా ఏళ్లుగా ఉంటున్నాను కాబట్టి నేను ఓ గ్లోబల్ బ్యూటీగా కావచ్చు లేదా ఓ వ్యక్తిగా కావచ్చు మొత్తానికి అద్భుతమైన క్రియేటివ్ ఫీల్డ్ లోనే ఉన్నాను. ఇదిలా ఉండగా ప్రియాంక ఇటీవల హాలీవుడ్ సినిమా 'ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్' మూవీలో సపోర్టింగ్ రోల్ ప్లే చేసింది. అలాగే బాలీవుడ్ లో 'ది స్కై ఈజ్ పింక్', ది వైట్ టైగర్ లాంటి సినిమాలలో కనిపించింది.