Begin typing your search above and press return to search.

కొంప‌దీసి పీసీ కూడా పార్ట‌న‌రా?

By:  Tupaki Desk   |   24 Feb 2018 2:30 AM GMT
కొంప‌దీసి పీసీ కూడా పార్ట‌న‌రా?
X
మాల్యా చేసిన కుంభ‌కోణం దేశాన్ని ఊపేశాక‌... ఇప్పుడు అదే స్థాయిలో వ‌చ్చిన కుంభ‌కోణం నీర‌వ్ మోదీ. మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌ముఖ జ్యూయ‌ల‌రీ బ్రాండ్ అధినేత‌. ఇప్పుడు బ్యాంకును మోసం చేసి విదేశాల‌కు పారిపోయిన ఆర్ధిక నేర‌స్థుడు. ఒక‌ప్పుడు ఆయ‌న జ్యూయ‌ల‌రీ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా బాలీవుడ్ స్టార్ హీరోలు - హీరోయిన్లు ఉండేవారు. వారిలో ప్రియాంక చోప్రా కూడా ఒక‌రు. నీర‌వ్ మోడీ బండారం బ‌య‌ట‌ప‌డ్డాక‌... ఇప్ప‌డు పీసీ త‌న త‌న కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అస‌లు నీర‌వ్ దేశంలోనే లేన‌ప్పుడు... ఇంత మోసం బ‌య‌ట‌ప‌డ్డాక ఇప్పుడు ప్రియాంక ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం కొంచెం అతిగానే అనిపిస్తోంది జ‌నాల‌కు.

నీర‌వ్ మోడీ జ్యూయ‌ల‌రీ బ్రాండ్‌కు ప్రియాంక చోప్రా - సిద్ధార్థ మ‌ల్హోత్రా - లీసా హెడెన్‌ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ఉన్నారు. నీర‌వ్ మోడీ పంజాబ్ బ్యాంక్ ను 11,000 కోట్ల రూపాయ‌ల‌కు ముంచేసి... విదేశాల‌కు పారిపోయాడు. దీంతో సిద్ధార్థ త‌న కాంట్రాక్టు ఏడాది క్రిత‌మే ముగిసింద‌ని చెప్పాడు. ప్రియాంక మాత్రం... తాను ఇప్పుడు కాంట్రాక్టును ర‌ద్దు చేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. నీర‌వ్ దేశం దాటి వెళ్లిపోయాక‌... అత‌డి ఆస్తులు - వ్యాపారాలు మూసివేశాక‌... ఇప్పుడు ప్రియాంక ప్ర‌క‌ట‌న చేయ‌డం కేవ‌లం ప్ర‌చారం కోస‌మే అనిపిస్తోంది. అంతేకాదు... కొంప‌దీసి ఆమెకు కూడా వ్యాపారంలో భాగ‌స్వామ్యం ఉందేమో అన్న సందేహాలు కూడా వ‌స్తున్నాయి.

అయినా ప్రియాంకకు ప్ర‌చారం అవ‌స‌ర‌మా? అమెరికా సినిమాలలో ఓ రేంజ్‌ లో న‌టిస్తోంది. క్వాంటికో సిరీస్ కావాల్సినంత పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్నాయి. దేశంలో ప‌లు సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగానూ ఉంది. నీర‌వ్ మోదీ వ‌ల్ల ఇదిగో ఇప్పుడు ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయాల్సి వ‌స్తోంది.