Begin typing your search above and press return to search.
బాక్సర్ తరువాత రన్నర్ పాత్ర షురూ
By: Tupaki Desk | 4 Oct 2017 5:30 PM GMTఇప్పుడు హీరోయిన్లలో సూపర్ స్టార్ స్టాటస్ మాత్రం కొద్దిమందికే దక్కుతోంది. దానికితోడు బాలీవుడ్ లో అలాంటి స్టాటస్ దక్కాలంటే మాత్రం ఖచ్చితంగా పెద్దల అండాదండా ఉండాలి. అలా ఉన్నా కూడా.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయిపోతుంటారు. అయితే ఒక ప్రక్కన గ్లామరసం విపరీతంగా దట్టిస్తూ.. బికినీల్లో వడ్డనలు చేస్తూ.. మరోప్రక్కన నటనాపరమైన టాలెంట్ చూపిస్తూ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న భామలు కూడా ఉన్నారు. వారే దీపికా పదుకొనె అండ్ ప్రియాంక చోప్రాలు.
అయితే దీపిక వరుసగా సంజయ్ లీలా భన్సాలి సినిమాలకు పరిమితం అయిపోతే.. ప్రియాంక మాత్రం హాలీవుడ్ లో సత్తా చాటుతోంది. ఇప్పుడు మరో బయోపిక్ లో కనిపించబోతోంది. ఆల్రెడీ మేరి కోమ్ జీవిత కథను తెర మీద రక్తి కట్టించిన ఈ సీనియర్ హీరోయిన్.. ఇప్పుడు కేరళకు చెందిన ప్రముఖ రన్నర్.. పిలవుల్ల కాండితెక్క వరంబిల్ ఉష.. ఎలియాస్ పి.టి.ఉష జీవితంపై రూపొందే బయోపిక్ లో ఆ రన్నర్ పాత్రలో మెరవనుంది. రెండు సంవత్సరాల నుండి వినిపిస్తున్న ఈ న్యూస్ నిజమేనంటూ సదరు సినిమాను డైరక్ట్ చేయనున్న దర్శకురాలు రేవతి వర్మ తెలిపింది.
మొత్తానికి ఒక ప్రక్కన హాలీవుడ్ లో తన అందాలతో ఫిదా చేస్తున్న ఈ డస్కీ బ్యూటి.. మరో ప్రక్కన ఇండియాలో మాత్రం వరుసగా ఇలాంటి బయోపిక్ లు .. సందేశాత్మక చిత్రాల్లో మెరుస్తూ సత్తా చాటుకుంటోంది. వయస్సు 35 టచ్ అయినా.. ఇంకా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతూ ఏడాదికి 100 కోట్లు షుమారు సంపాదించడానికి ఇదే కారణమేమో!!