Begin typing your search above and press return to search.
పెళ్లయ్యాక గుట్టు విప్పిందేం?
By: Tupaki Desk | 24 Dec 2018 9:27 AM GMTఒంటరిగా గదిలోకి వెళ్లకపోతే అవకాశాలు రావా? అందాల పోటీల్లో నెగ్గి మిస్ యూనివర్శ్ లు అయిన వాళ్లకే ఈ దారుణ దుర్యోధన ఫర్వం తప్పదా? పక్క పంచుకోవడానికి అంగీకరించకపోతే.. అవకాశాలు ఇవ్వరా? ఈ ప్రశ్నలన్నిటికీ ప్రియాంక చోప్రా మాతృమూర్తి మధు చోప్రా సమాధానం ఇచ్చారు. అవును అది నిజమే.. అలాంటి దారుణ పరాభవం నా కూతురికి కూడా తప్పలేదు అంటూ వాపోయారు. ఓ పబ్లిక్ వేదిక సాక్షిగా మధుచోప్రా తన కుమార్తె ప్రియాంక చోప్రా కు ఎదురైన అనుభవాల్ని పూసగుచ్చడం సంచలనమైంది.
ఓసారి ఓ నిర్మాత గదిలోకి రమ్మన్నాడు. కథ చెబుతానని పిలిచి నా కూతురిని మాత్రమే లోనికి పిలిచాడు. కథ చెప్పడానికి తనని మాత్రమే ఎందుకు ఆహ్వానించాడు. నన్ను కూడా పిలవొచ్చు కదా? అనుకున్నాను ఆ సమయంలో. వేరొక నిర్మాత కూడా ఇంచుమించు ఇలానే ప్రవర్తించాడు. కేవలం గదిలోకి రానన్నందుకు పది పదిహేను అవకాశాల్ని ప్రియాంక చోప్రా కోల్పోయింది అని తెలిపారు. గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించారని, ఒప్పుకోనంటే అవకాశాలు ఇవ్వలేదని మీటూ వేదికగా మధుచోప్రా వ్యాఖ్యానించడం సంచలనమైంది.
వాస్తవానికి మధు చోప్రా ఆరోపణలు ఇప్పుడే కొత్తేమీ కాదు. ప్రియాంక చోప్రా స్వయంగా ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో ఈ కఠోర నిజాల్ని బయటికే చెప్పారు. అయితే ఆ నిర్మాతలెవరు.. దర్శకులెవరు? అన్నది ఇప్పటికి అప్రస్తుతం. మిస్సులే కాదు, మిస్ యూనివర్శ్ లకు ఈ వెతలు తప్పలేదన్నది మాత్రం నిజం. ఇకపోతే ప్రియాంక చోప్రా ఇటీవలే నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో పీసీ గుట్టు మొత్తం ఇలా బయటికి చెప్పాల్సిన అసవరం ఏంటి? గతం గతః అని వదిలేయాల్సింది కదా? అని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇలాంటి నిజాల్ని బయటకు ఎన్ని సార్లు చెబితే అంతా బుద్ధొస్తుందనే సపోర్టర్స్ ఉన్నారు.