Begin typing your search above and press return to search.

పీసీ సినిమాకి అవార్డ్ వచ్చిందోచ్

By:  Tupaki Desk   |   13 Feb 2017 4:37 PM GMT
పీసీ సినిమాకి అవార్డ్ వచ్చిందోచ్
X
ఇటు బాలీవుడ్ ని అటు హాలీవుడ్ ని చుట్టేస్తున్న ప్రియాంక చోప్రా.. మరోవైపు సినిమా నిర్మాణం కూడా చేసేస్తోన్న సంగతి తెలిసిందే. పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి.. వరుసగా పలు భాషల్లో సినిమాలు తీసేస్తోంది. గతేడాది ఈమె నిర్మాణంలో ఓ మరాఠీ మూవీ రూపొందింది. "వెంటిలేటర్" అనే టైటిల్ పై రూపొందిన మూవీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

గతేడాది నవంబర్ లో వెంటిలేటర్ రిలీజ్ కాగా.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ వెంటిలేటర్ కు.. 15వ పూనే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఓ అవార్డ్ దక్కింది. బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో వెంటిలేటర్ అవార్డ్ దక్కించుకోగా.. దర్శకుడు రాజేష్ మపుస్కర్ దీన్ని అందుకున్నాడు. 'నా మొదటి అవార్డ్ ను పూనే ఫిలిం ఫెస్టివల్ లో అందుకోవడం ఆనందంగా ఉంది. నా స్క్రీన్ ప్లేను గుర్తించిన ఇంటర్నేషనల్ జ్యూరీకి కృతజ్ఞతలు. మా టీం మొత్తం గర్వించదగ్గ క్షణం ఇది' అన్నాడు దర్శకుడు రాజేష్.

నిర్మాత ప్రియాంక చోప్రా తల్లి మధుచోప్రా కూడా స్పందించింది. మరాఠీలో తాము నిర్మించిన తొలి మూవీకే ఇంటర్నేషనల్ అవార్డ్ రావడం ఆనందంగా ఉందని చెప్పిన ఆమె.. న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ కు కూడా ఈ చిత్రం ఎంపికైనట్లు చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/