Begin typing your search above and press return to search.

మోస్ట్ సెక్సియెస్ట్ ఉమెన్.. మళ్ళీ ఆమే

By:  Tupaki Desk   |   7 Dec 2017 1:13 PM GMT
మోస్ట్ సెక్సియెస్ట్ ఉమెన్.. మళ్ళీ ఆమే
X
బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉందనే చెప్పాలి. ఎవరికి వారు గ్లామర్ షోలతో రెచ్చిపోతుంటే బెస్ట్ బ్యూటీ ఒక్కరే అని చెప్పడం చాలా కష్టం. కానీ అప్పుడప్పుడు అవార్డ్స్ వారిని వారిస్తూ అభిమానుల్లో ఉన్న కన్ఫ్యూజన్ కి క్లారిటీని ఇస్తాయి. ఎక్కువ సెక్సీ గా ఉన్న అందగత్తేల్లో గత కొంత కాలంగా కొంత మంది హీరోయిన్స్ మధ్య పోటీ కూడా చాలా గట్టిగా ఉంది.

కానీ ఎవరూ ఏ స్థాయిలో పోటీ పడినా బాలీవుడ్ బెస్ట్ సెక్సీ గర్ల్ ప్రియాంక చోప్రాయే నిలుస్తోంది. ఒక్క బాలీవుడ్ లోనే కాదండోయ్ ఏషియన్ మొత్తంలో సెక్సీయెస్ట్ బ్యూటీగా అమ్మడు గుర్తింపు దక్కించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. రీసెంట్ గా లండన్ బేసుడ్ వీక్లీ న్యూస్ పేపర్ ఈస్టర్న్ ఐ ప్రతి ఏడాదిలాగే ఈ ఇయర్ కూడా 50 మంది సెక్సీయెస్ట్ ఉమెన్స్ ని సెలెక్ట్ చేయగా మన ఇండియన్ బ్యూటీ ప్రియాంక చోప్రా టాప్ లో నిలిచింది.

అమ్మడికి ఈ గుర్తింపు లభించడం ఇది మొదటి సారి కాదు. వరుసగా అయిదు సార్లు గెలుచుకోవడం నిజంగా రికార్డ్ అని చెప్పాలి. ఈ విషయాన్ని గురించి దీపిక ట్విట్టర్ ద్వారా స్పందించింది. ముందుగా నా తల్లిదండ్రులకు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వారివల్లే కదా నాకు ఇంత అందం వచ్చింది. అంటూ.. వరుసగా అయిదు సార్లు నాకు ఈ గుర్తింపు ఇచ్చినందుకు ఈస్టర్న్ ఐ వారికి కృతజ్ఞతలు అని తెలిపింది. ఇక మరో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె కి మూడవ స్తానం దక్కగా.. టీవీ నటీమణి నియా శర్మ కి రెండవ స్తానం దక్కింది.