Begin typing your search above and press return to search.
అందుకే అప్ సెట్ అవుతోంది
By: Tupaki Desk | 23 March 2016 7:30 PM GMTప్రియాంక చోప్రా రేంజ్ ఇప్పుడు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి చేరిపోయింది. కానీ ఈ మధ్య ఈ భామకు బాగా చిరాకు పెరిగిపోయిందని అంటున్నారు. ఈ స్థాయికి చేరాక అసలు చిరాకు పడాల్సిన అవసరం ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్ లో వెలిగిపోతున్న ప్రియాంక.. ఓ విషయంలో మాత్రం బాగా అప్ సెట్ అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు.
ప్రియాంక చోప్రాను గురించి చెప్పేందుకు ఆమెను కేవలం బాలీవుడ్ నటి అని అంటున్నారు. ఇలా తనను ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం చేయడం ఆమెకు అంతగా నచ్చడం లేదట. తనపై ఇలా ఓ స్టాంప్ వేసేయడం ఇష్టం లేదని ప్రియాంక అంటోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ గా తనను గుర్తించాలన్నది ప్రియాంక వాదన. అలా కాకుండా.. కేవలం ఓ ప్రాంతానికి చెందిన ఇండస్ట్రీకి తనను లిమిట్ చేయడం నచ్చడం లేదని చెబుతోంది ప్రియాంక.
'క్వాంటికో' సిరీస్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మాజీ ప్రపంచ సుందరి.. ప్రస్తుతం 'బేవాచ్' పేరుతో తెరకెక్కిస్తోన్న సినిమాలో విలన్ రోల్ లో నటిస్తోంది. 1990ల్లో సూపర్ హిట్ అయిన ఓ టీవీ సీరిస్ కి ఇధి సినిమా రూపం. ఇప్పటికే హాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ నటి అన్న స్టాంప్ ను ఇష్టపడ్డం లేదు. హాలీవుడ్ నటులను ఫ్రెంచ్ నటుడు - స్పెయిన్ స్టార్ అంటూ ప్రత్యేకంగా పిలవరు కదా అంటోంది ప్రియాంక. ఈమె వినిపిస్తున్న వాదన వింటుంటే., కరెక్టే అనిపిస్తోంది కదూ.