Begin typing your search above and press return to search.
భర్త అతడి సోదరులకు కంగ్రాట్స్ చెప్పిన పీసీ
By: Tupaki Desk | 24 Sep 2020 1:30 AMబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ మరియు అతడి సోదరుల మ్యూజిక్ ట్రూప్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శణలు ఇచ్చారు. అమెరికాలో వీరికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆదాయంతో పాటు వీరు సొంతం చేసుకున్న అవార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు దక్కించుకున్న నిక్ జోనస్ బ్రదర్స్ ట్రూప్ ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డులకు సంబంధించి నామినేట్ అయ్యారు. ఏకంగా నాలుగు విభాగాల్లో వీరు అవార్డలకు నామినేట్ అవ్వడంతో టీం మొత్తం చాలా సంతోషంగా ఉంది.
జోనస్ బ్రదర్స్ ట్విట్టర్ లో అధికారంగా వారు ఈ నామినేషన్ కు సంబంధించిన విషయాన్ని ప్రకటించారు. ఆ ట్వీట్ ను రీ ట్వీట్ చేసి కంగ్రాట్స్ అంటూ ప్రియాంక చోప్రా కామెంట్ పెట్టింది. మొత్తం 55 కేటగిరీలకు గాను వీరు నాలుగు కేటగిరిల్లో నామినేట్ అయ్యారు. టాప్ డ్యుయో.. టాప్ రెడియో సాంగ్ ఆర్టిస్ట్.. టాప్ రేడియో సాంగ్.. టాప్ ఆర్టిస్టు విభాగాలకు గాను వీరు నామినేట్ అయ్యారు. అక్టోబర్ 14న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో వీరి ప్రదర్శణ ఉండబోతుంది. వీరికి కనీసం రెండు మూడు విభాగాల్లో అయినా అవార్డులు వస్తాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.