Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: గ్రామీలో సూపర్ హాట్ జోడీ
By: Tupaki Desk | 27 Jan 2020 4:57 AM GMTప్రియాంక చోప్రా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. నిక్ జోనాస్ ను వివాహం చేసుకున్న తర్వాత క్రేజ్ మరింతగా పెరిగింది. గ్లోబల్ సుందరిగా పేరు తెచ్చుకుంది. మిసెస్ నిక్ జోనాస్ గా మారిన బాలీవుడ్ సినిమాలకు దూరమైంది కానీ హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్.. ఫ్యాషన్ ఈవెంట్లు.. ఇతర కార్యక్రమాలు ఏవైనా జరిగితే ప్రియాంక తప్పనిసరిగా వాటికి హాజరవుతుంది. భర్తతో కలిసి మరీ గ్లామర్ ఒలకబోస్తూ ఫ్యాషన్ ప్రియులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది.
ఈమధ్య గ్రామీ అవార్డ్స్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగానే భర్త నిక్ జోనాస్ తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి తీయించుకున్న ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలో నిక్ సూటుబూటులో దొరబాబులా నిలుచుంటే.. ప్రియాంక ఒక పొడవాటి డిజైనర్ డ్రెస్ లో హొయలుపోయింది. వీ నెక్ లు చాలానే ఉంటాయి కానీ వీనాభి నెక్. అనుమానం లేదు ఇది కొత్తపదమే. వీ నెక్ ను నాభి వరకూ సాగదీస్తే వీ-నాభి నెక్! అమెరికా డిజైనర్లు కదా.. మనకంటే పెద్ద కళాపోషకులు. ఇక ఈ డ్రెస్ కు వెనక వేలాడే దారాలు.. డ్రెస్ అయితే యమా సెక్సీగా ఉంది. ప్రియాంక ఆ డ్రెస్సును ఏమాత్రం మొహమాటం లేకుండా ధరించి అందాలను వడ్డించింది.
పైకి శ్రీరంగనీతులు చెప్తూ ఉంటారు కానీ జనాలకు ఇలాంటిఫోటోలే కావాలి. అందుకే లక్షల్లో.. మిలియన్లలో లైకులు వచ్చాయి. కరెక్ట్ గా చెప్పుకుంటే 1.4 మిలియన్ లైక్స్. ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు. "గ్రామీ ఈవెంట్ లో స్పెషల్ మీరే".. "నిక్ పై ఫోకస్ చేయడం కష్టంగా ఉంది".. "సూపర్ హాట్ కపుల్".. అంటూ కామెంట్లు పెట్టారు. ప్రియాంక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'వి కెన్ బి హీరోస్' అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.