Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: నేను నా క్యూట్ ప‌ప్పీ

By:  Tupaki Desk   |   19 Oct 2018 2:30 PM GMT
ఫోటో స్టోరీ:  నేను నా క్యూట్ ప‌ప్పీ
X
పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా ప్రియుడు నిక్ జోనాస్‌ ని పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. జైపూర్‌ లో ఈ జంట వివాహం జ‌ర‌గ‌నుంద‌ని - న‌వంబ‌ర్‌ లో ముహూర్తం ఫిక్స్ చేశార‌ని ప్ర‌చార‌మైంది. ఇదివ‌ర‌కూ మోకా (నిశ్చితార్థం) ఈవెంట్‌ లోనే అందుకు సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు. తాజాగా పెళ్లి భాజాకి స‌మ‌య‌మాస‌న్న‌మైంది. డూడూడూ అంటూ డోలు భాజా వాయించ‌డ‌మే ఆల‌స్యం. ఇప్ప‌టికే వెన్యూ ఫిక్స్ చేశార‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

అదంతా స‌రే.. ఈ ఖాళీ స‌మ‌యాన్ని పీసీ ఏ రేంజులో అస్వాధిస్తోందో చూశారా? ప్ర‌స్తుతం ఈ భామ గ్లోబ్‌ ని కేవ‌లం గంట‌ల్లోనే చుట్టేస్తోంది. అప్ప‌టిక‌ప్పుడు ముంబైలో ఉంటోంది. అప్ప‌టిక‌ప్పుడే లండ‌న్ - న్యూయార్క్ అంటూ నిక్‌ తో క‌లిసి షికార్లు చేస్తోంది. రీసెంట్‌ గానే న్యూయార్క్‌ లో వాలిపోయిన ఈ అమ్మ‌డు.. ఇదిగో ఇలా ప‌ప్పీని వెంట తీసుకుని వెళుతూ క‌నిపించింది.

నేను - నా ప‌ప్పీ జాగింగ్ చేస్తున్నాం.. నాతో ఎవ‌రైనా జాయిన్ అవుతారా? అంటూ ఎన్‌ వైసీ వీధుల్లో ఇలా వేడి పెంచింది పీసీ. క్యూట్ ప‌ప్పీ తో షికార్ వేళ టాప్ టు బాట‌మ్ అల్ట్రా మోడ్ర‌న్ లుక్‌ లో అద‌ర‌గొట్టేసింది. రోమ్ వెళ్లిన‌ప్పుడు రోమ‌న్‌ లా ఉండాల‌న్న చందంగా స్టైలిష్ గాగుల్స్ తో మైమ‌రిపించింది. అన్న‌ట్టు పెళ్లికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది కాబ‌ట్టి, అందుకు త‌గ్గ‌ట్టే పీసీలో టెన్ష‌న్ స్టార్ట‌యింద‌నే అర్థ‌మ‌వుతోంది. అందుకే భ‌ర‌త్ లాంటి భారీ చిత్రాన్ని కాద‌నుకుంది. పెళ్లి త‌ర్వాత అస‌లు క‌థ మొద‌ల‌వుతుంద‌న్న‌మాట‌!!