Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు బాలీవుడ్ మూవీకి రెడీ

By:  Tupaki Desk   |   8 Feb 2017 2:34 AM GMT
ఎట్టకేలకు బాలీవుడ్ మూవీకి రెడీ
X
ప్రియాకం చోప్రా ఇప్పుడు హాలీవుడ్ లో కూడా వెలిగిపోతోండడంతో.. బాలీవుడ్ పై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. గతేడాది ప్రారంభంలో వచ్చిన జై గంగాజల్ మినహాయిస్తే.. రీసెంట్ టైంలో హిందీ సినిమా ఏదీ చేయలేదు. అడపా దడపా ఇండియా వచ్చి యాడ్స్ లో నటించి.. న్యూయార్క్ చెక్కేయడం మినహాయిస్తే.. దేశీయ సినిమాల్లో కనిపించలేదు పీసీ. అసలు బాలీవుడ్ సినిమాలనే ఓకె చెయ్యట్లేదు.

కానీ మళ్లీ ఇన్నాళ్లకు ప్రియాంక ఓ హిందీ సినిమా ఒప్పుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీపికా పదకొనేతో పద్మావతి తీస్తున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. తాజాగా పీసీకి ఓ స్టోరీ చెప్పాడట. కథ మాదిరిగా కాకుండా.. తనకు నచ్చిన పుస్తకాన్ని చదవి వినిపించాడట భన్సాలీ. స్టోరీతో పాటు తన పాత్ర కూడా విపరీతంగా నచ్చేయడం.. సంజయ్ లీలా భన్సాలీపై ఉన్న నమ్మకంతో వెంటనే ఓకే చెప్పేసిందని.. బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం హాలీవుడ్ మూవీ బేవాచ్ లో ప్రియాంక నటిస్తుండగా.. మే నెలలో ఈ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు టీవీ సిరీస్ క్వాంటికో తర్వాతి సీజన్ ను కూడా కంప్లీట్ చేస్తోంది. ఈ రెండు పూర్తి కాగానే.. భన్సాలీతో మూవీ స్టార్ట్ చేయనుందిట ప్రియాంక చోప్రా.