Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: హాటు రూటులో జవాల్కర్

By:  Tupaki Desk   |   28 Feb 2019 1:30 AM GMT
ఫోటో స్టొరీ: హాటు రూటులో జవాల్కర్
X
విజయ్ దేవరకొండ లాస్ట్ ఫిలిం 'టాక్సీవాలా' చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమా షూటింగ్ మొదలుపెట్టిన రెండేళ్ళ వరకూ రిలీజ్ కాకపోవడం.. పైగా ఆ సినిమా రిలీజ్ కు ముందే లీక్ కావడం తనకు టెన్షన్ తెప్పించే విషయాలే కానీ మొదటి సినిమానే విజయ్ దేవరకొండ లాంటి రైజింగ్ స్టార్ తో చేయడం.. అది కూడా కమర్షియల్ హిట్ సాధించడం జవాల్కర్ కు ఫుల్ జోష్ ను ఇచ్ఛాయి. అయితే ఈ భామకు భారీ సంఖ్యలో ఆఫర్లేమీ రావడం లేదు.

రవితేజ సినిమా 'డిస్కో రాజా' లో ప్రియాంక జవాల్కర్ ను హీరోయిన్ గా పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయిగానీ ఇంకా అధికారికంగా అయితే ప్రకటన రాలేదు. ఈ ఆఫర్లతో సంబంధం లేకుండా ప్రియాంక హాటు ఫోటోషూట్లలో పాల్గొంటూ సోషల్ మీడియాలో హీటు పెంచుతోంది. ప్రియాంక ఫోటో షూట్లు ఇప్పటివరకూ ఒక రెగ్యులర్ స్టైల్ లో ఉంటూ వచ్చాయి కానీ రీసెంట్ గా ఈ బ్యూటీ కొంచెం స్పీడ్ పెంచింది. అల్ట్రా మోడరన్ గా మారిపోయింది. ముంబై భామలకు తానేమీ తీసిపోను అన్నట్టుగా ఒక ఫోటోషూట్ చేసింది.

రెడ్ కలర్ టాప్.. లూజ్ గా వదిలేసిన హెయిర్ తో ఒక హాట్ మోడల్ లాగా పోజులిచ్చింది. లిప్ స్టిక్ తప్ప పెద్దగా మేకప్ కూడా లేదు. కానీ తన ఎక్స్ ప్రెషన్స్ తో మాత్రం మగనెటిజనుల హృదయాలను గాయపరుస్తోంది. గతంలో పోలిస్తే ఇది రెడ్ హాట్ ట్రాన్స్ ఫార్మేషన్. ఈ రేంజ్ లో ఫోటో షూట్స్ లో పాల్గొంటే హీరోయిన్ అవకాశాలు ప్రియాంకను వెతుక్కుంటూ వస్తాయేమో.