Begin typing your search above and press return to search.
టాక్సీవాలా భామ రెడీ.. పాప బుట్టలో ఒక సినిమా!
By: Tupaki Desk | 6 Feb 2020 2:30 AM GMTవిజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం నమోదు చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక జవాల్కర్ కు ఎందుకో కానీ పెద్దగా బ్రేక్ రాలేదు. ఒకటి అరా అవకాశాలు వచ్చినట్టు వార్తలు వచ్చినా ఇప్పటివరకూ ప్రియాంక నటించిన మరో సినిమా విడుదల కాకపోవడంతో దాదాపుగా ప్రియాంకను మర్చిపోయారు. ఈ సమయంలో మరోసారి ప్రియాంక మళ్లీ నెమ్మదిగా లైమ్ లైట్ లోకి వస్తోంది.
ప్రియాంకకు రీసెంట్ గా ఒక ఆఫర్ వచ్చిందని సమాచారం. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం మరో సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకకు ఆఫర్ రావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతే కాదు.. 'చూసీ చూడంగానే' ఫేమ్ శివ కందుకూరి హీరోగా సుజన అనే నూతన దర్శకురాలు తెరకెక్కించే మరో సినిమాలో కూడా ప్రియాంక హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ రెండు సినిమాలు తనకు విజయాన్ని అందిస్తాయా.. మరిన్ని అవకాశాలు తీసుకొస్తాయా అనేది వేచి చూడాలి.
మరాఠి అమ్మాయి అయినప్పటికీ ప్రియాంక చదువుకున్నది మాత్రం అనంతపూర్ లోనే. ఆ లెక్కన ప్రియాంకను తెలుగు అమ్మాయి అనే అనుకోవాలి. అసలే హీరోయిన్లు తెలుగు మాట్లాడితే ఆమడ దూరం పెట్టే ఇండస్ట్రీ. ఏమమ్మా ప్రియాంకా.. తెలుగు బదులు ఏ అస్సామీసో.. చైనీసో.. కరోనా వైరసో ఏదో ఒకటి నేర్చుకుని ఉంటే నీకు ఎన్నో అవకాశాలు వచ్చి ఉండేవి కదా.. ఈ ఇబ్బందులు తప్పేవి. తెలుగు ఎందుకు నేర్చుకున్నావు ప్రియాంకా??